జగన్‌ను సస్పెండ్ చేయరా?: విజయమ్మకు రేవంత్ ప్రశ్న

దొంగ నోట్ల వ్యవహారంతో సంబంధం ఉన్న సిద్ధార్థ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు చాలా ఆరోపణలున్న జగన్‌ను ఎందుకు సస్పెండ్ చేయరని ప్రశ్నించారు. బ్యాంకులు, ఎటిఎంలు కొల్లగొట్టిన వారు, హత్య కేసు నిందితులు ఆ పార్టీలో ఉన్నారని ఎద్దేవా చేశారు. తమ మద్దతుదారులే అధిక పంచాయతీల్లో గెలిచారని ఆ పార్టీ చెబుతోందని, దమ్ముంటే జాబితాను విడుదల చేయాలని సవాల్ చేశారు.
మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మద్దతుదారులతో కలిపి పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కాంగ్రెసు వారికా పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆ మూడు పార్టీలు ఒక్కటై తప్పుడు లెక్కలు చూపిస్తున్నాయన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ ద్విపాత్రాభినయం చేస్తోందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టిడిపి కట్టుబడి ఉందని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ క్రిమినల్స్‌కి అడ్డాగా మారిందని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వేరుగా ఆరోపించారు. ఆ పార్టీ నేతల అకృత్యాలు పెచ్చుమీరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజమండ్రిలో ఎటిఎం సెక్యూరిటీ ఏజెన్సీ ఇన్‌చార్జి హత్య, దోపిడీ కేసు, ఎటిఎంల ద్వారా దొంగనోట్లు చలామణిలపై సిబిఐ విచారణ చేపట్టాలని యనమల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications