విభజన: సీమాంధ్ర దూతలుగా చిరంజీవి, కావూరి?

అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుండా ఉండేందుకు తమ దూతలుగా చిరు, కెవిపి, కావూరిలను పంపించాలని భావిస్తున్నారట. విభజన జరిగితే తెలంగాణలో పార్టీకి వచ్చే లాభమేమీ లేదని, సీమాంధ్రలో పార్టీ బతికే పరిస్థితి ఉండదని, ఇదే విషయాన్ని అధిష్టానానికి చెప్పి సమైక్యంగా ఉంచే ప్రయత్నాలు చేయాలని వారు ఆ ముగ్గురు నేతలను పెద్దల వద్దకు పంపించే విషయమై ఆలోచిస్తున్నారట.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌లతో ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో వారు చూచాయగా విభజన అంశాన్ని వారికి చెప్పారని వార్తలు వచ్చాయి.
అయితే పార్టీ అధిష్టానం ఇప్పటికే తెలంగాణపై నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేదని ఇంకొందరు అంటున్నారు. సీమాంధ్ర నేతల హెచ్చరికలకు, చిరంజీవి వంటి నేతల లాబీయింగుకు మొగ్గి తెలంగాణపై వెనక్కి తగ్గే అవకాశాలు లేవని అంటున్నారు. మరోవైపు కావూరి, చిరులు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పినందున వారు అంత చొరవ చూపకపోవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications