వార్‌రూమ్‌లో డిగ్గీ, ఆజాద్ టి చర్చ: క్యూలో త్రిమూర్తులు

తొలుత ముఖ్యమంత్రితో డిగ్గీ, ఆజాద్‌లు దాదాపు నలభై అయిదు నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఆ తర్వాత బొత్సతో అరగంట పాటు చర్చించారు. దామోదర వార్ రూమ్‌లో పెద్దలతో తెలంగాణపై చర్చిస్తున్నారు. కిరణ్, బొత్సల నుండి తెలంగాణపై చర్చించిన నేతలు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలని సూచించినట్లుగా తెలుస్తోంది.
కాగా అంతకుముందు ముఖ్యమంత్రితో సీమాంధ్ర మంత్రుల ఎపి భవన్‌లో ఉదయం భేటీ అయ్యారు. మంత్రులు శైలజానాథ్, టిజి వెంకటేష్, కాసు, ఏరాసు, మహీధర్ రెడ్డి, పార్థసారథి, వట్టి వసంత్ కుమార్, పితాని సత్యనారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
సమైక్యానికి కట్టుబడి రాజీనామా: వీరశివా
సమైక్యాంధ్రకు కట్టుబడే ఎమ్మెల్యే, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వీరశివా రెడ్డి చిత్తూరు జిల్లాలో స్పష్టం చేశారు. సిడబ్ల్యూసి సమావేశం అనంతరం కోస్తా జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేశారని వీరశివా రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications