సంప్రదింపులు పూర్తి, నిర్ణయించే టైం వచ్చింది: టిపై డిగ్గీ

Digvijay Singh
న్యూఢిల్లీ: తెలంగాణపై సంప్రదింపుల ప్రక్రియ ముగిసిందని, నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని, తాము తీసుకునే నిర్ణయాన్ని త్వరలో ప్రజలకు త్వరలో తెలియజేస్తామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ శుక్రవారం ఢిల్లీలో అన్నారు. వార్ రూమ్‌లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలతో భేటీ అనంతరం డిగ్గీ విలేకరులతో మాట్లాడారు.

తొలుత కిరణ్‌తో 45 నిమిషాలు, బొత్సతో అరగంట పాటు భేటీ అయిన దిగ్విజయ్ సింగ్, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌లు దామోదరతో రెండు గంటల పాటు సమావేశమయ్యారు. దామోదరతో తెలంగాణపై పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. విభజన జరిగితే పార్టీ పరిస్థితి పైన, ప్యాకేజీ ఇస్తే ఎలా ఉంటుందనే తదితర అంశాల పైన పూర్తిగా సమాచారం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

సాయంత్రం కోర్ కమిటీ భేటీ

ఈ రోజు సాయంత్రం కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా తెలంగాణ అంశం పైనే చర్చించనున్నట్లు తెలుస్తోంది. సిడబ్ల్యూసిలో తీసుకునే నిర్ణయంపై ఈ భేటీలో చర్చిస్తారు.

వెనక్కి తగ్గితే సమ్మె: దేవీ ప్రసాద్

తెలంగాణ విషయంలో వెనక్కి తగ్గితే మరోమారు మెరుపు సమ్మెకు దిగుతామని టిఎన్జీవో అధ్యక్షుడు దేవి ప్రసాద్ ప్రకటించారు. ఈ నెల 29 నుండి ఆగస్టు 5వ తేది వరకు హైదరాబాదులో సద్భావన ర్యాలీలు, ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామన్నారు. సీమాంధ్ర ఉద్యోగులను వ్యక్తిగతంగా కలిసి తెలంగాణకు అడ్డుపడవద్దని విజ్ఞప్తి చేస్తామన్నారు. ఎపి ఎన్జీవోలు హైదరాబాదులో సమావేశాలు పెడితే తాము అదే రోజు చలో హైదరాబాద్ నిర్వహిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+