గుడ్‌బై: జగన్‌పార్టీలో తెలంగాణ చిచ్చు, నేతల అల్టిమేటం

ఎమ్మెల్యేల రాజీనామాపై అధిష్టానం వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తాము ఒకటి రెండు రోజుల్లో భేటీ అయి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఎమ్మెల్యేల రాజీనామా వ్యక్తిగతమని అధిష్టానం ప్రకటిస్తే అభ్యంతరం లేదని లేదంటే పార్టీని విడిచి పెట్టేందుకు కూడా వెనుకాడమని కొమ్మూరి చెబుతున్నారు.
తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమం చేయలేదని, తామే తీవ్రంగా ఉద్యమం చేశామని కొమ్మూరి అన్నారు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని, వారిది వ్యక్తిగతమని ప్రకటించాలని లేదంటే తాము పార్టీని విడిచి వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలు గుర్తిస్తున్నామని, అనుకూలంగా ఉన్నామని జగన్ చెబితేనే తాము పార్టీలో ఉన్నామని కొమ్మూరి అన్నారు.
రాజీనామాలు వ్యక్తిగతమని పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రకటిస్తే తమకు అభ్యంతరం లేదని కొండా సురేఖ అన్నారు. దీనిపై వెంటనే స్పందించాలని లేదంటే తాము మరో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా గత కొంతకాలంగా సురేఖ అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తనకు పార్టీకి గ్యాప్ ఉన్న విషయమేనని ఆమె చెప్పారు. అయితే కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్న సురేఖ ఇప్పుడు సమయం చూసుకొని పెదవి విప్పి ఉంటారని అంటున్నారు.












Click it and Unblock the Notifications