తాగుబోతు భర్తను చంపిన భార్య, ప్రమాదంగా చిత్రీకరణ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం - ఎ. లక్ష్మినారాయణ అనే 49 ఏళ్ల ఆర్టిసి కండక్టర్ బుధవారంనాడు హత్యకు గురయ్యాడు. అయితే, మెట్ల మీది నుంచి పడి అతను చనిపోయాడని భార్య మంజుల చెప్పింది. లక్ష్మీనారాయణ శవంపై గాయాలు, గొంతు నులిమిన గుర్తులు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.
భర్త ప్రవర్తనతో విసిగిపోయిన మంజుల అతన్ని చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. లక్ష్మినారాయణ గత నాలుగేళ్లుగా ఉద్యోగానికి వెళ్లడం లేదని, ఇంటి అద్దె 13 వేల రూపాయలు వస్తుందని, దాన్ని ఖర్చు పెడుతూ వస్తున్నాడని, ఇంటి వద్దనే ఉండి విపరీతంగా మద్యం సేవిస్తూ ఉండేవాడని, భార్యను కొట్టేవాడని పోలీసులు చెప్పారు.
లక్ష్మినారాయణకు బుధవారం మంజుల డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. అయితే, అతను బలవంతంగా వాటిని తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో మంజుల అతన్ని ఓ స్తంభానికి కట్టేసి, గట్టి వస్తువుతో కొట్టింది. ఆ తర్వాత గొంతు నులిమింది. దీంతో అతను మరణించాడు. ప్రమాదవశాత్తు మరణించాడని చెప్పడానికి మెట్ల మీది నుంచి శవాన్ని కిందికి తోసింది.












Click it and Unblock the Notifications