కూతురిని కొట్టి చంపిన తల్లి, బిడ్డను బలి చేసిన మహిళ

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం - ఫర్హా బేగం ఇంటి బయట ఇసుకలో ఆడుకుంటోంది. దాంతో ఆగ్రహానికి గైరన గౌసియా పెద్ద గరిటెతో ఆమెను కొట్టడం ప్రారంభించింది. దీంతో శ్వాససంబంధమైన సమస్య తలెత్తి ఫర్హా మరణించింది. ఫర్హాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఎడతెగకుండా కొట్టడం వల్ల రమణించింది.
చిన్నపాటి తగాదాకు తీవ్రంగా ఆగ్రహించిన ఓ మహిళ తన నాలుగేళ్ల కూతురితో పాటు చెరువులో దూకింది. ఈ సంఘటన మేడ్చెల్‌లో నాలుగు రోజుల క్రితం చోటు చేసుకుంది. మహిళను స్థానికులు రక్షించారు. కానీ నాలుగేళ్ల పాప మృత్యువు పాలైంది. మంగళవారంనాడు పాప శవాన్ని బయటకు తీశారు.
మరణించిన పాపను నాలుగేళ్ల స్రవంతిగా గుర్తించారు. మేడ్చెల్‌లోని కండ్లకోయకు చెందిన నర్సింహ, సరితల కూతురు. నాలుగు రోజుల క్రితం నర్సింహ, సరిత గొడవ పడ్డారు. భర్త ఆమెను తిట్టి బయటకు వెళ్లిపోయాడు. అతను అలా వెళ్లిపోగానే సరిత తన కూతురిని తీసుకుని బయటకు వెళ్లి చెరువులో దూకింది. పోలీసులు సరితపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications