మాజీ కేంద్ర మంత్రి అరుణ్ నెహ్రూ కన్నుమూత

run Nehru
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ నెహ్రూ గురువారం రాత్రి కన్నుమూశారు. రాజీవ్ గాంధీ మంత్రి వర్గంలో ఆయన శక్తివంతమైన మంత్రిగా పేరు గడించారు. 69 ఏళ్ల అరుణ్ నెహ్రూ చాలా కాలంగా ఆస్వస్థతతో బాధపడుతున్నారు. ఆయన రాజీవ్ గాంధీకి సన్నిహిత బంధువు కూడా. ఆయనకు భార్య సుభద్ర, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

గుర్గావ్‌లో ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జన్మించిన నెహ్రూ మూడు సార్లు లోకసభకు ఎన్నికయ్యారు. కాలమిస్టు కూడా అయిన నెహ్రూ కొన్ని వారాల క్రితం గుర్గావ్‌లోని ఆస్పత్రిలో చేరారు.

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కూతురు ప్రియాంక వద్రా ఇటీవల ఆయనను ఆస్పత్రిలో సందర్శించారు. త్వరగా కోలుకోవాలని వారు ఆశించారు. రాజీవ్ గాంధీ హయాంలో ఆయన రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు.

1984 ఎన్నికల్లో ప్రజాకర్షణ గల అమితాబ్ బచ్చన్, సునీల్ దత్, మాధవ్ రావు సింధియా వంటివారిని ఎన్నికల్లో నిలబెట్టాలని ఆయన రాజీవ్ గాంధీకి సూచించారు. రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖను నిర్వహించారు.

ఆ తర్వాత ఆయన రాజీవ్ గాంధీతో విభేదించి జన మోర్చాను ఏర్పాటు చేసిన విపి సింగ్‌తో చేతులు కలిపారు. అరుణ్ నెహ్రూను రాజకీయ పరిపక్వత గల నేతగా జెడియు అధ్యక్షుడు శరద్ యాదవ్ ప్రశంసించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+