ముందే రాష్ట్రపతిని ఐతే బాగుండేది: ప్రణబ్, సందడిగా...

Pranab Mukherjee
న్యూఢిల్లీ: తాను మరికాస్త ముందే రాష్ట్రపతినైతే బాగుండేదని ప్రణబ్ ముఖర్జీ గురువారం అన్నారు. జూలై 25తో ఏడాది పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రణబ్, ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలతో రెండు గంటలపాటు ప్రజలతో, పిల్లలతో సందడి చేశారు.

పదవిలోకి రాగానే పలు పురాతన మందిరాలను, కట్టడాలను పునరుద్ధరించడంలో శ్రద్ధ చూపిన ఆయన తాను మరికొంచెం ముందే రాష్ట్రపతిగా వచ్చి ఉంటే ఇంకా కొన్నిటికి పూర్వ వైభవం తెచ్చేవాడినని చెప్పారు. ఉదయం కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రపతి భవన్‌లో ప్రజా గ్రంథాలయాన్ని ప్రారంభించారు.

ఎస్టేట్‌లో క్రికెట్ మైదానాన్ని ప్రాంగణంలోని పాఠశాలకు అంకితం చేశారు. మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రపతి వెబ్‌సైట్‌కు సంబంధించిన డిజిటల్ కార్యక్రమాలను అనుసంధానించారు. మొత్తంమీడ తొలి ఏడాది నిర్ణయాత్మక ప్రస్థానంలో ప్రహరీ వెలుపలకు వచ్చి, ప్రజలతో మమేకమయ్యారు.

అజ్మల్ కసబ్, అఫ్జల్ గురుల క్షమాభిక్ష అభ్యర్థనలను తిరస్కరించడంలోనే చొరవ చూపారు. ఇక రాష్ట్రపతి భవన్‌లో పాత సామగ్రి గదుల్లా మిగిలిన దర్బార్ హాలుకు పూర్వ వైభవం తెచ్చారు. లైబ్రరీ, మ్యూజియం దుమ్ము దులిపించారు. విలువైన పురాతన గ్రంథాలను పునరుద్ధరింపజేశారు. సిబ్బంది కుటుంబాల కోసం ఉపాధి శిక్షణ కల్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+