ఉల్లంఘన: షర్మిలపై ఎన్నికలసంఘానికి టిడిపి ఫిర్యాదు

కడప జిల్లా పుల్లంపేట మండలం బత్తూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు రిగ్గింగుకు పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఈసిని కోరారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసరలోను పోలీసులు అధికార కాంగ్రెసు పార్టీ పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఓట్ల లెక్కింపుకు ఆటంకం
ఓట్ల లెక్కింపుకు పలుచోట్ల ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద తోపులాటలు, బ్యాలట్ బాక్సులు లెక్కింపు కేంద్రానికి చేరక పోవడం, ఇరువర్గాల మధ్య ఘర్షణలతో లెక్కింపుకు ఆటంగం ఏర్పడి ఆలస్యం అవుతోంది.
రెండో విడతలో 6,971 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. చెదురుముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అన్ని గ్రామాల్లో భారీగా పోలింగ్ జరిగింది. విజయనగరం జిల్లాలో 92.97 శాతం పోలింగ్ జరిగింది.












Click it and Unblock the Notifications