టీలో 'హస్తం' హవా: తెరాసది రెండో ప్లేస్, వైకాప గల్లంతు

తెలంగాణలో అధికార కాంగ్రెసు పార్టీ ఆధిక్యం ప్రదర్శించింది. తెలంగాణాలోని ఏడు జిల్లాలలో అధికార కాంగ్రెస్ ఆధిక్యతను ప్రదర్శించింది. ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగర్, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇవి గాక ఇంకా తూర్పు గోదావరి, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో కూడా కాంగ్రెస్ ఆధిక్యతలో ఉంది.
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తొలి దశలోనూ, రెండవ దశలోనూ రంగారెడ్డిలో ఆధిక్యతను ప్రదర్శించింది. సీమాంధ్రలోని అనంతపురం, చిత్తూరు, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే తన ఆధిక్యతను చూపించింది. మిగిలిన చాలా చోట్ల ఈ పార్టీ మూడవ స్థానంలోనే ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రెండవ దశలో తన ఉనికిని చాటుకుంది. కాంగ్రెసుకు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
రెండో జిల్లాల్లో జగన్ పార్టీ గల్లంతు
ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బోణీ కూడా కొట్టలేదు. రెండు జిల్లాల్లో కూడా కాంగ్రెసు ఆధిక్యంలో ఉంది. తెరాస రెండో స్థానంలో ఉంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో ఒక్క నియోజకవర్గంలో కూడా సత్తా చాటలేదు. చంద్రగిరి నియోజకవర్గంలో మంత్రి గల్లా అరుణకుమారికి ఎదురు గాలి వీస్తోంది. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఆధిక్యంలో ఉన్నారు.












Click it and Unblock the Notifications