చిరు, కావూరిలకు భద్రత పెంపు: సీమాంధ్రకు బలగాలు

Additional forces
హైదరాబాద్: సీమాంధ్ర ముఖ్య నాయకులను పోలీసులు అప్రమత్తం చేశారు. కేంద్ర మంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివ రావు, పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వంటి వారి ఇళ్ల వద్ద అదనపు బలగాలను మోహరించారు. వారి భద్రతకు బిఎస్ఎఫ్ బలగాలను నియోగించారు. పర్యటనలకు వెళ్లినప్పుడు తమకు తప్పకుండా సమాచారం అందించాలని పోలీసులు వారిని అప్రమత్తం చేశారు. హైదరాబాదులోని సీమాంధ్ర ముఖ్య నేతల ఇళ్ల వద్ద భద్రతను పెంచారు.

రేపు మంగళవారం సాయంత్రం తెలంగాణపై సిడబ్ల్యుసి సమావేశం తుది నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో సీమాంధ్రకు అదనపు బలగాలను తరలిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలన్నింటినీ తీసుకుంటున్నారు. ప్రస్తుతం మరో 1200 పారా మిలటరి బలగాల జవాన్లు సీమాంధ్రకు చేరుకుంటున్నారు. గత వారం రోజులుగా సీమాంధ్రకు 23 కంపెనీల పారా మిలిటరీ బలగాలను తరలించారు. మరో 22 కంపెనీల బలగాలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 1000 బలగాలు రాష్ట్రానికి చేరుకుంటున్నాయి. మరిన్ని బలగాలు సీమాంధ్రకు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆంధ్రలోని విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాయలసీమలోని చిత్తూరు, కడప, అనంతపురం నగరాలకు బలగాలను పెద్ద యెత్తున తరలించారు. ఈ బలగాలు పూర్తిగా శాంతిభద్రతల పరిరక్షణపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రానికి దిగిన పారా మిలటరీ బలగాలను శాంతిభద్రతల పరిరక్షణకు తప్ప మరో పనికి వినియోగించకూడదని ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. అయితే, ఈ బలగాల మోహరింపుపై రాష్ట్రానికి చెందిన నాయకులు ఏమీ మాట్లాడడం లేదు. పారామిలటరీ బలగాల మోహరింపుపై విశాఖపట్నం సమైక్యాంధ్ర జెఎసి నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+