హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్: ఢిల్లీకి దానం, గౌడ్, బిల్లు పాస్‌కాదు: కిషన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Danam, Mukesh to visit Delhi on Tuesday
హైదరాబాద్: రాజధానికి చెందిన మంత్రులు ముఖేష్ గౌడ్, దానం నాగేందర్‌లు మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. విభజనపై జోరుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో హైదరాబాదు విషయమై అధిష్టానంతో చర్చించేందుకు వారు వెళ్లనున్నారు. తెలంగాణ అయినా, సమైక్యమైనా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్న దానం, ముఖేష్‌లు హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతమైతే మాత్రం వ్యతిరేకిస్తామని మొదటి నుండి చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో వాళ్లు ఢిల్లీకి వెళుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాదుపై అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంది, ఏం చేస్తారనే విషమయై వారు ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారని సమాచారం. కేంద్రపాలిత ప్రాంతం చేస్తే మాత్రం ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పే అవకాశాలున్నాయి. ఉమ్మడి రాజధానికి వీరు అంగీకరిస్తారు.

రాయల టి వ్యతిరేకించం: జైపాల్ యాదవ్

రాయల తెలంగాణ ఇస్తే తాము వ్యతిరేకించమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలతో కలిపి ఇచ్చినా అభ్యంతరం లేదన్నారు. హైదరాబాదును ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి రాజధానిగా అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాదును చేయాలని డిమాండ్ చేశారు.

సీమ విభజన అంటే అవమానించినట్లే: లబ్బి

రాయలసీమ విభజన అంటే సీమ ప్రాంతాన్ని అవమానించినట్లేనని సీనియర్ కాంగ్రెసు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి అన్నారు. సమైక్యాంధ్రకు రాజీనామాలే కొలబద్దలైతే తాము అందుకు వెనుకాడేది లేదన్నారు. తాను పార్టీలోనే ఉండి సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తానని చెప్పారు. తెలంగాణను ఏర్పాటు చేసినా కర్నూలుకు నీటి సమస్య రాదని ఆయన అన్నారు. సీమను విభజిస్తే మాత్రం వ్యతిరేకిస్తామన్నారు. స్వప్రయోజనాల కోసమే సీమ నేతలు విభజన రాగం ఆలపిస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెసు ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ కాదు: కిషన్

ఆంధ్రప్రదేశ్‌ను ఎలా పడితే అలా మార్చేందుకు ఈ రాష్ట్రం కాంగ్రెసు ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ కాదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను ఎందుకు తెరమీదకు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. బిజెపి లేకుంటే బిల్లు పాస్ కాదన్నారు. ప్రజలు రాయల తెలంగాణ అడగలేదన్నారు. ఉమ్మడి రాజధానికి తాము వ్యతిరేకమని, రెండు రాష్ట్రాలు, రెండు రాజధానులు కావాలన్నారు.

English summary

 AP ministers Danam Nagender, Mukesh Goud would leave for Delhi on Tuesday to meet the central leadership and is expected to hold a discussion on the Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X