వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇళ్ల ముట్టడి: సీమాంధ్ర నేతలకు సమైక్య సెగ

By Pratap
|
Google Oneindia TeluguNews

Seemandhra Leaders
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర నాయకులకు సమైక్య సెగ తాకుతోంది. సమైక్యవాదానికి మద్దతుగా సీమాంధ్రలో నిరసనలు పెరిగాయి. కేంద్ర మంత్రులు పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివ రావు తదితరుల ఇళ్లను సమైక్యవాదులు సోమవారం ముట్టడించారు.

విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు, కేంద్ర మంత్రి పురంధేశ్వరి, పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి కార్యాలయాలను ముట్టడించడానికి సమైక్యాంధ్ర జెఎసి కార్యకర్తలు ప్రయత్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సమైక్యాంధ్రకు మద్దతుగాకేంద్ర మంత్రి కావూరి ఇంటి ముట్టడికి సమైక్యాంధ్ర జెఎసి ప్రయత్నించింది. గుంటూరులో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు ఇంటిని ముట్టడించడానికి సమైక్యాంధ్ర జెఎసి కార్యకర్తలు ప్రయత్నించారు.

తిరుపతిలో పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ నివాసం వద్ద సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆందోళన చేపట్టింది. రాజీనామా చేయాలని వారు చింతా మోహన్‌ను డిమాండ్ చేస్తున్నారు. కడపలో సమైక్యాంధ్రకు మద్దతుగా కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సాయి ప్రతాప్ నివాస ముట్టడికి సమైక్యాంధ్ర జెఎసి కార్యకర్తలు ప్రయత్నించారు.

కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు సిఎం రమేష్ నివాసాన్ని జెఎసి ముట్టడించింది. సీమాంధ్ర జేఏసీ ర్యాలీలో ఎంపీ సాయిప్రతాప్ పాల్గొన్నారు. రాష్ట్రాన్ని విడగొడితే సహించేది లేదని, అవసరమైతే రాజీనామాలకు సిద్ధమని సాయి ప్రతాప్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి నివాసాన్ని సీమాంధ్ర జెఎసి ముట్టడించింది.

విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమైక్యాంధ్రకు మద్దతుగా లగడపాటి రాజగోపాల్ ఇంటిని ముట్టడించిన సమైక్యాంధ్ర ఉద్యోగ జెఎసి నాయకులు నివాసంలోకి దూసుకెళ్లారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. కాగ, సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగ జేఏసీ నేతలు ఐదంస్థుల భవనం ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

English summary
Supporters of united Andhra Pradesh on Monday intensified their protests in the Rayalaseema and coastal Andhra regions against the Congress leadership's reported proposal to divide the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X