వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై యూపిఏ ఏకగ్రీవం, రాజీనామాపై కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్యపక్షాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయని ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ చెప్పారు. యూపిఐ భాగస్వామ్య పక్షాలు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశమయ్యాయి. సమావేశంలో ప్రధాన భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్, ఎన్సీపి, ఆర్ఎల్డీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీలు పాల్గొన్నాయి. యాభై నిమిషాల పాటు భేటీ జరిగింది. తెలంగాణపై పార్టీలు అభిప్రాయాలు చెప్పాయి. ప్రధాని నివాసంలో యూపిఏ సమన్వయ కమిటీ భేటీ జరిగింది.

మంచి వాతావరణం: కిరణ్

ఢిల్లీలో మంచి వాతావరణం ఉందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం అన్నారు. విభజనపై ఢిల్లీ వేడెక్కిన విషయం తెలిసిందే. యూపిఏ సమన్వయ కమిటీ, సిడబ్ల్యూసి భేటీ నేపథ్యంలో కిరణ్ ఢిల్లీకి వచ్చారు. పార్టీ పెద్దలను కలిసిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ... తాను రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలే అన్నారు. ఢిల్లీలో మంచి వాతావరణం ఉందని వ్యాఖ్యానించారు.

UPA meeting

ప్రధానితో భేటీ

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్, ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్, ముఖ్యమంత్రి కిరణ్, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలు భేటీ అయ్యారు. అనంతరం సిడబ్ల్యూసి భేటీ ప్రారంభం కానుంది.

సోనియా నివాసంలో సిడబ్ల్యూసి భేటీ, ఎపి నుండి సంజీవ రెడ్డి

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో సిడబ్ల్యూసి భేటీ అయింది. సిడబ్ల్యూసిలో రాష్ట్రం నుండి సంజీవ రెడ్డి ఒక్కరే ఉన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, ఎస్ఎస్ కృష్ణ, శివరాజ్ పాటిల్, అంబికా సోని, హరి ప్రసాద్, జనార్ధన్ ద్వివేది, ముఖుల్ వాస్నిక్, ఎకె ఆంటోనీ, మోతీలాల్ వోరా, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, ఆస్కార్ ఫెర్నాండేజ్, ఊర్మిళా సింగ్ తదితరులు సిడబ్ల్యూసిలో ఉన్నారు. తెలంగాణపై యూపిఏ తీర్మానాన్ని సిడబ్ల్యూసిలో లాంఛనంగా ఆమోదించే అవకాశముంది.

English summary
According to TV Channels report... The UPA coordination committee has unanimously endorsed a separate Telangana statehood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X