సొంతూళ్లో కావూరి, కిల్లిలకు షాక్: జూపల్లికి జగన్ పార్టీ

kavuri sambasiva rao and killi kruparani
హైదరాబాద్: కేంద్ర జౌళీ శాఖ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావుకు స్వగ్రామంలో షాక్ తగిలింది. బుధవారం జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ఆయన పెదపారుపూడి మండలం దోసపాడు గ్రామంలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. దోసపాడు కావూరి స్వగ్రామం. కాంగ్రెసు అభ్యర్థి పైన టిడిపికి చెందిన శివ కుమార్ 950 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

కేంద్రమంత్రి కిల్లి కృపారాణికి కూడా స్వగ్రామంలో ఓటర్లు ఝలక్ ఇచ్చారు. ఆమె స్వగ్రామం పోలవరంలో స్వతంత్ర అభ్యర్థి బాలకృష్ణ కాంగ్రెసు పార్టీ పైన ఘన విజయం సాధించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన తెరాస ఎమ్మెల్యే జూపల్లి కృష్ణా రావు స్వగ్రామం పెద్దదగడలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి గెలుపొందారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గం వెంకన్నపాలెంలో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి తోడికోడలు గెలిచారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో టిడిపి అభ్యర్థి, బసవతారకం స్వగ్రామం కొమరోలులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

పోలింగ్ ప్రశాంతం

మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి చెప్పారు. చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగిందన్నారు. మూడు దశల్లో కలిపి 87 శాతం పోలింగ్ జరిగిందన్నారు. రాత్రి నుండి ఎన్నికల కోడ్ ఉండదన్నారు. ఎన్నికలు వాయిదా పడిన గ్రామాల్లోనే ఉంటుందన్నారు. కొన్నిచోట్ల పోటీ చేసే అభ్యర్థులు మృతి చెందడంతో ఆగస్టు 8, 13 తేదీలకు పోలింగ్ వాయిదా వేసినట్లు చెప్పారు. గుంటూరు జిల్లాలో ఆరు చోట్ల వాయిదా పడిన ఎన్నికలు ఆగస్టు ఎనిమిదిన వాయిదా వేసినట్లు చెప్పారు.

కడప జిల్లాలో విషాదం

కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మైలవరం మండలంలోని పొన్నంపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటమి చెందారు. దీంతో గుండెపోటుతో అతను మృతి చెందారు. సీతంపల్లిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిని ఓడిపోయారు. దీంతో ఆమె బంధువు ఆత్మహత్య చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+