సోనియాతో రాములమ్మ భేటీ, రేణుకా రాయభారమే!

సోనియా, విజయశాంతి భేటీలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కూడా పాల్గొన్నారు. గత కొంతకాలంగా విజయశాంతి కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే. రాములమ్మ కాంగ్రెసు పార్టీలోకి వచ్చేందుకు రేణుకా చౌదరే రాయబారం నెరపినట్లుగా చెబుతున్నారు.
విజయశాంతి ఏ క్షణంలోనైనా కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల తెరాస ఆమెను బహిష్కరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమెకు షోకాజ్ నోటీసు ఇచ్చినట్లుగా ఆ తర్వాత ఎలాంటి విషయం తెలియరాలేదు. విజయశాంతి కూడా తనకు ఎలాంటి షోకాజ్ నోటీసు రాలేదని, అందిన తర్వాత సమాధానం చెబుతానని చెప్పారు.
ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెసు పార్టీలో చేరుతారని, సోనియాతో భేటీ అవుతారని ప్రచారం జరిగింది. పది రోజుల క్రితం కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూల ప్రకటన చేసిన రోజునే ఢిల్లీలో విజయశాంతి నివాసం వద్ద ఇందిరా గాంధీ ఫ్లెక్సీ వెలిసింది.












Click it and Unblock the Notifications