వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'దాడి బాధ్యత పాక్‌దే': జవాన్లకు నివాళులు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్తాన్ సాయం లేనిదే సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి దాడులు జరగవని రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ లోకసభలో గురువారం ప్రకటించారు. రెండు రోజుల క్రితం ఆయన చేసిన ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. పాక్ సైన్యం దుస్తుల్లో ఉగ్రవాదులు దాడులు చేశారని ఆయన మొదట చెప్పారు.

ఈ రోజు ఆయన మరోసారి ప్రకటన చేశారు. తనకు అందిన సమాచారం మేరకే లోకసభలో మొదటి ప్రకటన చేశానని పేర్కొన్నారు. పూంఛ్ సెక్టారులో దాడి జరిగిన ప్రాంతాన్ని ఆర్మీ చీఫ్ పరిశీలించారని ఆయన తెలిపారు. పాకిస్తాన్ సాయం లేకుండా లాంటి దాడులు జరగవన్నారు.

దాడుల్లో పాక్ జవాన్ల ప్రమేయముందన్నారు. జవాన్లపై దాడికి పూర్తి బాధ్యత పాక్ సైన్యానిదే అన్నారు. కాగా రెండు రోజుల క్రితం పాక్ సైన్యం దాడిలో ఐదుగురు భారత జవాన్లు మృతి చెందారు. ఆంటోనీ మొదటి ప్రకటనపై ప్రతిపక్షాలు మండిపడటమే కాకుండా ఆయన రాజీనామాకు పట్టుబట్టాయి. దీంతో ఆయన ఈ రోజు మరోసారి ప్రకటన చేశారు.

నివాళులు

నివాళులు

పూంఛ్ సెక్టారు వద్ద రెండు రోజుల క్రితం జరిగిన దాడిలో మృతి చెందిన ఐదుగురు భారత జవాన్‌లకు నివాళులు అర్పిస్తున్న సైనికులు. మృత దేహాలను న్యూఢిల్లీలోని పాలం టెక్నికల్ విమానాశ్రయానికి తీసుకు వచ్చారు.

మోసుకు వస్తున్న సైనికులు

మోసుకు వస్తున్న సైనికులు

పూంఛ్ సెక్టారు వద్ద పాకిస్తాన్ దాడిలో ఐదుగురు భారత జవాన్లు మృతి చెందారు. మృతి చెందిన సైనికుల మృత దేహాలను భారత సైన్యం న్యూఢిల్లీలోని పాలం టెక్నికల్ విమానాశ్రయంలో మోసుకెళ్తున్న దృశ్యం

విమానంలోకి...

విమానంలోకి...

పాకిస్తాన్ దాడిలో పూంఛ్ సెక్టారు వద్ద మృతి చెందిన ఐదుగురు జవాన్లలో ఓ జవాన్ మృతదేహాన్ని తీసుకు వెళ్తున్న భారత సైన్యం. రెండు రోజుల క్రితం జరిగిన దాడిలో మన జవాన్లు మృతి చెందారు. చనిపోయిన వారిలో నలుగురు బీహార్ రాష్ట్రానికి చెందిన వారే.

నివాళి

నివాళి

పూంఛ్ సెక్టారు వద్ద రెండు రోజుల క్రితం జరిగిన దాడిలో మృతి చెందిన ఐదుగురు భారత జవాన్‌లకు నివాళులు అర్పిస్తున్న సైనికులు. మృత దేహాలను న్యూఢిల్లీలోని పాలం టెక్నికల్ విమానాశ్రయానికి తీసుకు వచ్చారు.

పాట్నాలో..

పాట్నాలో..

పూంఛ్ సెక్టారు దాడి ఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందగా అందులో నలుగురు బీహార్ రాష్ట్రానికి చెందిన వారు. వారిని పాట్నా విమానాశ్రయానికి తీసుకు వచ్చిన దృశ్యం

బిహతాలో..

బిహతాలో..

పూంఛ్ సెక్టారు వద్ద దాడి జరిగిన ఘటనలో మృతి చెందిన వారిలో బీహార్ రాష్ట్రంలోని బిహతాకు చెందిన విజయ్ కుమార్ రాయ్ ఉన్నారు. విజయ్ కుమార్ రాయ్‌కు నివాళులు అర్పించారు.

English summary
Wednesday saw Defense Minister AK Antony in a large puddle after his controversial statement on LoC killings came back to haunt him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X