బాబు క్లియర్‌గా ఉంటే కిరణ్ భయపెడ్తున్నారు: విహెచ్

kiran kumar reddy and chandrababu naidu
హైదరాబాద్: విభజనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు క్లియర్‌గా ఉంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం భయపెట్టేలా మాట్లాడుతున్నారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు శుక్రవారం నిప్పులు చెరిగారు. విభజనపై నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదని కిరణ్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. యూపిఏ తీర్మానం చేశాకనే, పార్టీ నిర్ణయించిందన్నారు.

హైకమాండ్ ఆలోచనను ధిక్కరించేలా కిరణ్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కేంద్రాన్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడటం సరికాదన్నారు. ప్రభుత్వం తీసుకుంటే పార్టీ తీసుకోలేదని, పార్టీ తీసుకుంటే ప్రభుత్వం తీసుకోలేదని కిరణ్ నిర్ణయంపై వింత వాదన చేస్తున్నారన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇలా మాట్లాడటం సరికాదన్నారు. కిరణ్‌ను ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎలా ఆలోచన చేశారో... విభజనపై కూడా అధిష్టానం అలాగే ఆలోచించిందన్నారు.

కిరణ్ లేవనెత్తుతున్న నీరు, విద్యుత్ తదితర సమస్యలను అధిష్టానం పరిశీలించిందన్నారు. కిరణ్‌ను తొలగించాలా లేదా అన్నది అధిష్టానం తీసుకునే నిర్ణయమన్నారు. ఇన్నాళ్లు మౌనం వహించిన కిరణ్ ఇప్పుడు మీడియాకు ఎక్కడం సరికాదన్నారు. కిరణ్ విపక్ష నేతగా మాట్లాడినట్లుందన్నారు. అన్ని తెలిసి ఇలా మాట్లాడటం సరికాదని, ఆయన నిర్ణయాన్ని కూడా అధిష్టానం తీసుకుందన్నారు.

కిరణ్ స్టేట్‌మెంట్ తెలంగాణలో ఉద్యమాన్ని రెచ్చగొట్టేలా ఉందన్నారు. పార్లమెంటులో టిడిపి ఎంపీలు నిరసన చెబుతుంటే తాను... బాబు అనుకూలమని చెబుతుంటే మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారని ప్రశ్నిస్తే, తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని, తమ ప్రాంతంకు భారీ ప్యాకేజీ, సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నామని వారు స్పష్టంగా చెప్పారన్నారు. సీమాంధ్రకు ప్యాకేజీ కోసం అధిష్టానంతో మాట్లాడుతామని తాను వారికి చెప్పానన్నారు.

ఇప్పుడు కాంగ్రెసు పార్టీ నేతలో విభజనపై ఇలా మాట్లాడటం సరికాదన్నారు. విభజనకు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి బీజం వేశారన్న వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. అదే నిజమైతే ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలు కిరణ్ మరోసారి చేయవద్దన్నారు. ముఖ్యమంత్రి స్థాయికి ఇది తగదన్నారు. విభజన జరిగినా ఎవరు ఇక్కడి నుండి వెళ్లిపోవాల్సిన అవసరం లేదన్నారు. ఇక్కడున్న వారంతా తెలంగాణ వాళ్లే అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+