బెదిరిస్తున్నారు: ఎపిఎన్జీవో, సిఎం కర్రీపాయింట్‌పై ఈటెల

శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు పాలన స్తంభించిందన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో నిరసన తెలిపేందుకు తమకు అనుమతించాలని ఆయన కోరారు. బుధవారం తాము రాజధానిలో నిరసన తెలుపుతామన్నారు. తాము శాంతియుతంగా సమ్మె చేస్తుంటే రెచ్చగొట్టవద్దన్నారు. తాము బెదిరింపులకు భయపడకుండా సమ్మెలో పాల్గొంటామన్నారు. రేపు ప్రభుత్వ హైదరాబాద్ కార్యాలయాల్లో నిరసన తెలుపుతామన్నారు.
సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తేనే కాంగ్రెసు పార్టీ అధిష్టానం, కేంద్రం దిగి వస్తుందన్నారు. ఈ నెల 16న ఉద్యోగ సంఘాల భేటీ ఉంటుందన్నారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి ఆంటోనీ కమిటీకి తమ ఆందోళన తెలియజేస్తామన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై పార్లమెంటులో చర్చ జరగాలన్నారు.
రాజకీయ నిరుద్యోగుల వల్లే: మేకపాటి
రాజకీయ నిరుద్యోగుల వల్లనే రాష్ట్ర విభజన సమస్య వచ్చిపడిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్నారు. ఎపిఎన్జీవోల నిరసనకు ఆయన సంఘీభావం తెలిపారు. కాంగ్రెసు నేతలు ఉత్తుత్తి రాజీనామాలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.
సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి కేంద్రం పైన ఒత్తిడి తీసుకు రావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున లేచిందని, ఎపిఎన్జీవోలు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేశారన్నారు.
కిరణ్‌ను కర్రీపాయింట్ పెట్టుకోమంటే తప్పేంటి?: ఈటెల
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కర్రీ పాయింట్ పెట్టుకోమంటే తప్పేమిటని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ వేరుగా ప్రశ్నించారు. ఆయన బెంగళూరులో రెస్టారెంట్ పెట్టింది నిజం కాదా అన్నారు. ముఖ్యమంత్రి సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమస్యకు పరిష్కారం చూపించాల్సింది పోయి.. కన్ఫ్యూజ్ ప్రకటనలు చేస్తే ఎలా అన్నారు.
తెలంగాణలో ఆత్మహత్యలపై కాంగ్రెసు పార్టీ ఏమాత్రం స్పందించలేదని మండిపడ్డారు. తెలంగాణలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే అనాథ శవమని మార్చురీకి తరలించారన్నారు. తెలంగాణ బిడ్డలు అప్పుల పాలై గల్ఫ్‌లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. తిరుపతిలో కార్లును కాల్చారని, చిత్తూరులో డ్రైవర్లను అడ్డుకున్నారని.. కలిసుండాలని కోరుకునే వారు చేసే పని ఇదేనా అని ఈటెల ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications