టి: చిరుపై హరి, బావనడగాలని హరికృష్ణపై హరీష్ ఫైర్

కిరణ్‌ను తాను అభినందిస్తున్నానని చెప్పారు. రాజకీయాల పైన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారన్నారు. రాజకీయాలే వద్దనుకున్న సోనియా తన అభిప్రాయం మార్చుకున్నారని, ఇప్పుడు తెలంగాణపై కూడా మార్చుకుంటారన్నారు. కాంగ్రెసు తన ప్రకటన పైన వెనక్కి పోవాల్సిందే అన్నారు. తెలంగాణపై తొందర అవసరం లేదన్నారు. హైదరాబాదులో ఉండవద్దనడానికి తెరాస నేతలు ఎవరన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రాకతో ఇతర పార్టీల్లో ప్రకంపనలు రాలేదని, ఆ పార్టీలోనే వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రజలు సహజంగా శాంతికాముకులని, ఇప్పుడు సమైక్యం కోసం ఉవ్వెత్తున ఉద్యమిస్తున్నారన్నారు. ఈ స్థాయిలో ఇంకా చర్చలేంటన్నారు. పార్టీలన్నీ తమ గత నిర్ణయాలు మార్చుకోవాలన్నారు. కాంగ్రెసు తెలంగాణపై వెనక్కి పోవాలన్నారు. ప్రజల మనోభావాలు వ్యక్తీకరిస్తున్న నేతల పైన పార్టీలు హూకూం జారీ చేయవద్దని కోరారు.
బాబే కారణం: కొడాలి నాని
ప్రస్తుత పరిస్థితికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే కారణమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొడాలి నాని అన్నారు. బాబు, కిరణ్‌లు వెన్నెముక లేని నేతలన్నారు. ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర రెడ్డిలు ఉంటే కాంగ్రెసు విభజనపై నిర్ణయం తీసుకునేది కాదన్నారు. చంద్రబాబు ఇప్పుడు స్పందించే ఏం లాభమన్నారు. ముందుగానే స్పందించవల్సి ఉండెనన్నారు.
హరికృష్ణకు హరీష్ రావు..
విభజనపై ఎవరిన అడిగి నిర్ణయం తీసుకున్నారన్న టిడిపి రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ పైన తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు వేరుగా మండిపడ్డారు. ఎవరిని అడిగి చేశారో వెళ్లి నీ బావ చంద్రబాబు నాయుడును అడుగు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. 2008లోనే బాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారని, ఇప్పుడు కేంద్రాన్ని అడిగి లాభమేమిటన్నారు. నాడు ఎన్టీఆర్‌కు, ఇప్పుడు తెలంగాణకు వెన్నుపోటు పొడుస్తున్నారన్నారన్నారు. నాడు తండ్రి పైన చెప్పులు వేయించి.. ఇప్పుడు ఆయన పేరుతో నీతులు చెబుతున్నారంటూ నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications