నటి రమ్య రోడ్డుషో: సానుభూతి కలిసొచ్చేనా?(పిక్చర్స్)
బెంగళూరు: శాండిల్ వుడ్ నటి, కాంగ్రెసు పార్టీ నాయకురాలు రమ్య ఉప ఎన్నికలలో కర్నాటకలోని మాండ్య లోకసభ నుండి బరిలోకి దిగుతున్నారు. ఈమె సోమవారం తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికలకు తొమ్మిది రోజుల ముందు ఆమె తన ప్రచారాన్ని భావోద్వేగంతో ప్రారంభించారు.
ఈ నెల 21వ తేదిన ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాగా రమ్యకు ఉప ఎన్నికల్లో సానుభూతి పవనాలు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రమ్య సంరక్షకులు ఇటీవల మృతి చెందారు.
రమ్య నామినేషన్ వేసే రోజునే ఆయన మృతి చెందారు. ఆ తర్వాత ఆమె కుంగిపోయారు. దీంతో ఆలస్యంగా నిన్న ఆమె మద్దతుదారులతో కలిపి ప్రచారాన్ని ప్రారంభించారు. కాగా జెడి(ఎస్) నుండి మాజీ ఎమ్మెల్యే సిఎస్ పుత్తరాజు నామినేషన్ దాఖలు చేశారు.

ప్రచారం ప్రారంభించిన రమ్య
ప్రముఖ నటి, కాంగ్రెసు పార్టీ నాయకురాలు రమ్య సోమవారం సీనియర్ పార్టీ నేతలు, తన మద్దతుదారులతో కలిపి ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక శ్రీ కాలికాంబ గుడిలో పూజలు చేసిన అనంతరం రమ్య ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ దశలో ఆమె కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యం. రమ్య పక్కన మంత్రి, నటుడు అంబరీష్ ఉన్నారు.

రమ్య వెంట నేతలు
మాండ్య లోకసభ స్థానానికి కాంగ్రెసు పార్టీ నుండి పోటీ చేస్తున్న ఆ పార్టీ నేత, శాండిల్ వుడ్ నటి రమ్య... ఇతర పార్టీ నేతలతో ఉన్న దృశ్యం. మంత్రి, నటుడు అంబరీష్ ఆమె తరఫున ప్రచారం చేస్తున్నారు.

ప్రచారంలో రమ్య
నటి రమ్య ఇటీవల జరిగిన కర్నాటక సాధారణ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరఫున జోరుగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఆమె మాండ్య లోకసభ స్థానం నుండి పోటీ చేస్తుండటంతో ముఖ్యనేతలు ఆమె గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు.

అంబరీష్ నేతృత్వంలో...
ప్రముఖ నటుడు, మంత్రి అంబరీష్ మాండ్య కాంగ్రెసు పార్టీ లోకసభ అభ్యర్థిని రమ్య తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న దృశ్యం

వీధుల్లో రమ్య ప్రచారం
మాండ్య లోకసభ స్థానానికి కాంగ్రెసు పార్టీ నుండి పోటీ చేస్తున్న ఆ పార్టీ నేత, శాండిల్ వుడ్ నటి రమ్య నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్న దృశ్యం. గట్టి బందోబస్తు దృశ్యం.

కాళికాంబ ఆలయం
సోమవారం ప్రచారానికి ముందు స్థానిక కాళికాంబ ఆలయంలో కాంగ్రెసు పార్టీ మాండ్య అభ్యర్థి రమ్య పూజలు చేశారు. అందుకోసం దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ బందోబస్తు

రమ్య రోడ్డుషో
మాండ్య లోకసభ స్థానానికి కాంగ్రెసు పార్టీ నుండి పోటీ చేస్తున్న ఆ పార్టీ నేత, శాండిల్ వుడ్ నటి రమ్య నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తున్న దృశ్యం.












Click it and Unblock the Notifications