వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంసెట్ కౌన్సెలింగ్ యధాతథం: నో వర్క్ నో పే

By Pratap
|
Google Oneindia TeluguNews

EAMCET
హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్‌ను యధాతథంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా, లేదా అనే అనుమానాలు తలెత్తాయి. దామోదర రాజనర్సింహ ఆదేశాలతో సందిగ్ధతకు తెరపడింది. సీమాంధ్రలో ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ఆటంకం ఏర్పడే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ఆయన శనివారం ఆదేశించారు.

ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమానులు శనివారం దామోదర రాజనర్సింహను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ యధాతథంగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ కౌన్సెలింగ్‌ను ఈ నెల 19వ తేదీ నుంచి నిర్వహించాలని నిర్ణయించారు. సీమాంధ్రలో ఉద్యమాలు చెలరేగుతున్నప్పటికీ ఈ తేదీల్లో మార్పు చేయరాదని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇదిలావుంటే, సమైక్యాంధ్రను డిమాండ్ చేస్తూ ఎపి ఎన్జీవోలు సమ్మెకు దిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నో వర్క్ నో పే నిబంధనను అమలులోకి తెచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఈ నెల 8వ తేదీన సర్క్యులర్ జారీ చేశారు. దీనిప్రకారం పని చేయాలని కాలానికి ప్రభుత్వోద్యోగులకు జీతాలు రావు. తెలంగాణ ఉద్యోగులు సమ్మె చేసిన కాలంలో కూడా ఇటువంటి సర్క్యులర్‌నే ప్రభుత్వం జారీ చేసింది.

ఉద్యోగుల హాజరును ప్రతి రోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలలోగా తెలియజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాఖాధిపతులను ఆదేశించారు. సమైక్యాంధ్రను డిమాండ్ చేస్తూ ఎపిఎన్జీలు సమ్మెకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని భావిస్తోంది. ఎస్మా ప్రయోగించినా భయపడేది లేదని, సమ్మె కొనసాగుతుందని ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు.

English summary
Deputy CM Damodara Rajanarsimha clarified that EAMCET counselling will be held as schedule from august 19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X