హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మాయిలా చాటింగ్ చేసి, పరిచయమై చంపేశాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Women
హైదరాబాద్: అమ్మాయిలా ఆన్‌లైన్‌లో స్నేహం చేసిన ఓ వ్యక్తి ఫైనాన్స్ వ్యాపారిని చంపేశాడు. ఈ సంఘటన హైదరాబాదులోని అంబర్‌పేటలో గల తురాబ్‌నగర్‌లో జరిగింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. 2007 మే 4వ తేదీన కుటుంబ సభ్యులంతా షాపింగ్‌కు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న పైనాన్స్ వ్యాపారి గోపీదేవ్ హత్యకు గురయ్యాడు.

గోపీదేవ్ గదిలో పోలీసులకు నీలిచిత్రాల సీడీలు, రుణగ్రస్తులకు సంబంధించిన ఒప్పంద పత్రాలు తప్ప మరేమీ దొరకలేదు. పెద్ద మొత్తంలో అప్పుతీసుకున్న వారెవరైనా అతడ్ని హత్య చేసి ఉంటారనేది పోలీసుల అనుమానించారు. లక్షల్లో అప్పు తీసుకున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో 2008 ఆగస్టులో కేసును మూసివేశారు.

అయితే కరీంనగర్ జిల్లాలోని మూడు హత్యల కేసులో విచారణ జరుపుతుండగా ఆ కేసు విషయం కూడా బయటపడింది. ఈ మూడు హత్యలు కేవలం డబ్బు కోసమే చేశారని అక్కడి పోలీసుల దర్యాప్తులో తేలింది. లభించిన ఆధారంతో కరీంనగర్‌కు చెందిన సుభాష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రోజుల తరబడి సాగిన విచారణలో తన స్నేహితుడు రమేష్‌రెడ్డితో కలిసి హత్యలు చేశానని సుభాష్‌రెడ్డి అంగీకరించాడు. ఫైనాన్స్ వ్యాపారి గోపీదేవ్‌నూ తానే హత్య చేశానని చెప్పాడు. రిమాండ్‌లో ఉన్న సుభాష్‌రెడ్డి, రమేష్‌రెడ్డిని అంబర్‌పేట్ పోలీసులు పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకుని విచారించగా ఫైనాన్స్ వ్యాపారి హత్యోదంతం వివరాలు బయటపడ్డాయి.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి - కరీంనగర్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ సుభాష్‌రెడ్డి హైదరాబాదులోని నాగోల్‌లో ఉండేవాడు. అతడు గోపీదేవ్‌కు ఓ యువతిలా ఆన్‌లైన్ చాటింగ్‌లో పరిచయమయ్యాడు. గోపీచంద్ తన వ్యక్తిగత వివరాలు, వ్యాపార లావాదేవీలు చాటింగ్‌లో చెప్పేశాడు. కొన్ని రోజులపాటు సాగిన దొంగ చాటింగ్ వ్యవహారం ఓ రోజు బయటపడింది. ఆన్‌లైన్‌లో చాటింగ్ చేస్తున్నది అమ్మాయి కాదు, అబ్బాయి అనే విషయం గోపీదేవ్‌కు తెలిసిపోయింది.

అయితే, వారిద్దరి మధ్య స్నేహం బెడిసికొట్టలేదు. ఫోన్లలో తరుచూ మాట్లాడుకుండేవారు. తన స్నేహితుడైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రమేష్‌రెడ్డికి సుభాష్ రెడ్డి గోపీదేవ్ ఆస్తులు, డబ్బు గురించి చెప్పాడు. అతన్ని చంపి డబ్బు దోచుకోవాలని ఇద్దరూ పథకం వేశారు.

2007 మే 4వ తేదీ ఉదయం గోపీదేవ్ ఇంటికి సుభాష్‌రెడ్డి, రమేష్‌రెడ్డి వెళ్లారు. వారిని హాల్లో కూర్చోబెట్టిన గోపీదేవ్ బెడ్‌రూంలోకి వెళ్లాడు. ల్యాప్‌టాప్ చూస్తున్న గోపీదేవ్‌ను వెనుకనుంచి వచ్చిన సుభాష్‌రెడ్డి లుంగీతో గొంతు బిగించాడు. అతడు కేకలు వేస్తుండగా రమేష్‌రెడ్డి దిండుతో ముఖాన్ని బలంగా నొక్కడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. డబ్బు కోసం నిందితులు బీరువాలో వెతకగా ఏమీ లభించలేదు. గోపీదేవ్ చేతి వేలికున్న ఉంగరం, 800 రూపాయల నగదు తీసుకుని ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు.

English summary
A finance bisinessman hs been killed in hyderabad by a online friend. The case has been unearthed after 6 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X