లక్షలు హుష్‌కాకి: రోడ్డు మీద పడ్డ మహిళా ఎడిటర్

పరిస్థితులు తారుమారయ్యాయి. ఆమె ఇప్పుడు అన్నీ పోయి ఫుట్‌పాత్ మీదికి వచ్చి పడ్డారు. ముంబైలో అత్యంత ప్రజాదరణ పొందిన గృహలక్ష్మి పత్రికకు ఆమె 2007లో సంపాదకురాలిగా పనిచేశారు. ముంబైలోని ఫ్లాట్లను విక్రయించి ఆమె థానేలో స్థిరపడినట్లు ఐబియన్ లైవ్ వార్తాకథనం తెలిపింది.
తాజ్ నుంచి భోజనం తెప్పించుకుని ఒకప్పుడు తాను తినేదాన్ననని, ఇప్పుడు ఇలా ఉన్నానని, ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదని ఆమె అంటోంది. తన బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా కరిగిపోయిందనే విషయంపై ఆమెకు ఏ మాత్రం తెలియదు. తన ఖాతాను తన మాజీ తోటి ఉద్యోగి నిర్వహించేవారని చెప్పింది. సహోద్యోగి నెంబర్ కూడా ఆమె వద్ద లేకుండా పోయింది.
ఆరోగ్యం క్షీణిస్తుండడంతో తన వద్ద మిగిలిన డబ్బులు కూడా క్రమంగా కరిగిపోతూ వచ్చాయి. థానేలోని తన ఫ్లాట్‌ను వదిలేసి ఆమె వెరసోవాలోని అద్దె ఇంట్లోకి మారారు. అద్దె చెల్లించడం కూడా సాధ్యం కాకపోవడంతో ఫుట్‌పాత్ మీదికి చేరారు.
ప్రస్తుతం ఆమె గురుద్వారాలో ఆశ్రయం తీసుకుంటున్నారు. మహిళా సెల్‌కు వెళ్లడానికి నిరాకరిస్తున్నారు. తాను తిరిగి సంపాదించగలనని, కానీ కొంత సహాయం కావాలని ఆమె అంటున్నారు. విద్యావంతురాలైన సుమిత్రా నాయక్ ఐదు భాషలు మాట్లాడగలరు.












Click it and Unblock the Notifications