రెచ్చగొడ్తున్నారు: ఆనం, కాంగ్రెస్‌కైనా గుడ్‌బై: లగడపాటి

ఇది ద్వంద వైఖరి కాదా అని ప్రశ్నించారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలమంటూ ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చినప్పుడు ఏ ప్రజలు ఆయన్ని అడిగారని ప్రశ్నించారు. చేసిందంతా చేసి ఇప్పుడు ప్రజలనే అడుగుతా అని అంటున్నారని ఎద్దేవా చేశారు. పాదయాత్ర చేసిన సమయంలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు పోటీపడి తెలంగాణపై ప్రకటనలు చేశాయన్నారు.
మరోవైపు, సమైకాంధ్య్ర కోసం తాను పదవికి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని, అవసరమైతే కాంగ్రెస్ పార్టీని వీడేందుకు కూడా సిద్ధమేనని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఈ నెల 30 లోపు రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ప్రకటించకపోతే రాజకీయ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, తామంతా పదవులు వీడి బయటికొచ్చేస్తామని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
కాగా, విభజన వల్ల దేశానికి మంచిదా? రాష్ట్రానికి మంచిదా? లేక... రాజకీయంగా మన పార్టీకి మంచిదా? అని ఆంటోనీ కమిటీని ప్రశ్నించినట్లు మంత్రి రామచంద్రయ్య న్యూఢిల్లీలో అన్నారు. చిన్న రాష్ట్రాలు మంచిది కాదని ఆర్థిక నిపుణులంతా చెబుతున్నారన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని తెలిపారు.












Click it and Unblock the Notifications