వస్తున్న రాష్ట్రాన్నివద్దనే వాళ్లనిక్కడే చూస్తున్నాం: కిషన్

పార్టీలు, నాయకులు తమ స్వార్థ రాజకీయం కోసం రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా పార్టీ నేతలు, ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమం చేయిస్తున్నారని విమర్శించారు. అదే సమయంలో, సీమాంధ్ర ప్రజల్లోనూ సెంటిమెంటు ఉందని అంగీకరించారు. వారి అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత కిరణ్, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణల పైన లేదా అని ప్రశ్నించారు.
2004, 2009 ఎన్నికల మేనిఫెస్టోల్లో తెలంగాణ అంశం ఉన్న విషయం వారికి తెలియదా అన్నారు. ఇరుప్రాంతాల్లో ఉద్యమాల ద్వారా ఏ రకంగా లబ్ధి పొందుదామా అని కాంగ్రెస్, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు చూస్తున్నాయని విమర్శించారు. ఈ విషయంలో తమ పార్టీ నేతలు సీమాంధ్రలో ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అయితే, ఆ ప్రాంతంలో తమకు ఎమ్మెల్యేలు లేరని, వాయిస్ కూడా తక్కువేనని చెప్పారు. మిగతా పార్టీలు ఒప్పించుకోవాలన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశానికి ఒక బిసి ప్రధాని కాకూడదా అని ప్రశ్నించారు. మోడీ మాటలకు జవాబు చెప్పే దమ్ము లేకే కులం పేరుతో విమర్శిస్తున్నారన్నారు. సోనియా, దిగ్విజయ్, ఆజాద్ దయాదాక్షిణ్యాలతో మోడీ ప్రధాని కారని, ఆయన ప్రధాని కావాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications