వెనుకడుగు ప్రసక్తి లేదు, టికి పార్టీలు అనుకూలం: డిగ్గీ

తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, సిపిఐ, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితిలు తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయం చెప్పాయన్నారు. పార్టీలు అన్ని అభిప్రాయం చెప్పాకనే చివరలో కాంగ్రెసు పార్టీ తన అభిప్రాయం చెప్పిందన్నారు. ఇందులో తమ పార్టీని తప్పు పట్టాల్సింది ఏమీ లేదన్నారు. ఇంతదూరం వచ్చాక తెలంగాణపై మరో మాట లేదన్నారు. ఇప్పుడు కాంగ్రెసు నిర్ణయాన్ని వ్యతిరేకించడం సరికాదన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఎంసెట్ కౌన్సెలింగ్‌ను అడ్డుకోవద్దని ఆయన కోరారు. ఉద్యోగులు విద్యార్థులకు సహకరించాలని కోరారు. సీమాంధ్రుల అభిప్రాయాలు, ఆందోళనలు తెలుసుకునేందుకు ఆంటోని కమిటీ ఏర్పడిందన్నారు. ఎవరైనా కమిటీకి అభిప్రాయాలు చెప్పవచ్చునన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామన్నారు.
విభజన విషయంలో చాలా చర్చలు జరిపామని, అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నాకే నిర్ణయం తీసుకున్నామన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేసే విషయం సహా పలు అంశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అంటోని కమిటీ సంప్రదింపులు ముగిశాక ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications