భేటీ: నష్టమని కిరణ్, శాశ్వత పరిష్కారమని సోనియా

కిరణ్ రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, సీమాంధ్రలోని ఉద్యమ తీవ్రతను, పార్టీ పరిస్థితిని వారి దృష్టికి తీసుకు వెళ్లారు. సీమాంధ్రలో ఊహించనిరీతిలో ఉద్యమం జరుగుతోందని కిరణ్ వారికి చెప్పారని సమాచారం. జలవనరులు, హైదరాబాదు, ఉపాధి అంశాలపై సోనియాకు మరోసారి వివరించారు.
విభజన నిర్ణయం ద్వారా ఇరు ప్రాంతాల్లోను కాంగ్రెసు పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పారు. కిరణ్ వాదనను సోనియాతో పాటు రాహుల్ సావదానంగా విన్నారని తెలుస్తోంది. అనంతరం తెలంగాణకు శాశ్వత పరిష్కారం చూపిద్దామని ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రితో సోనియా అన్నారని తెలుస్తోంది.
విభజన విషయంలో దాదాపు అన్ని పార్టీలు సానుకూలంగానే స్పందించాయని, అఖిల పక్షంలో కూడా పార్టీలు అనుకూలంగా చెప్పాయని, ఆ తర్వాతనే కాంగ్రెసు పార్టీ, కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారని సమాచారం. కాగా, కిరణ్ మధ్యాహ్నం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో భేటీ కానున్నారు.












Click it and Unblock the Notifications