వీడిన మిస్టరీ: డ్రైవరే హంతకుడు, వేధింపుల వల్లే

Realtor murder case busted
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరిగిన రియల్టర్ హత్య కేసు మిస్టరీ వీడింది. డ్రైవరే ఆ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని లక్డీకపూల్‌లోని హోటల్ హంషైర్‌లో హత్యకు గురైన విజయనగరం జిల్లాకు చెందిన రియల్టర్ వై శివప్రసాద్ రావు (56) కేసు మిస్టరీని పోలీసులు 72 గంటల్లోనే చేధించారు. హంతకుడ్ని మృతుడి కారు డ్రైవర్ బిర్లంగి ప్రశాంత్‌గా గుర్తించారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ మంగళవారం తన కార్యాలయంలో మీడియాకు తెలిపారు. ఈనెల 16న హోటల్ హంషైర్‌లో రియల్టర్ శివప్రసాద్ రావు హత్య జరిగింది. దీనికి సంబంధించి హోటల్ సిబ్బంది ఈనెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శివప్రసాద్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లావాసి బిర్లంగి ప్రశాంత్‌ను హంతకుడిగా గుర్తించారు. ఈనెల 15న బెంగళూర్ నుంచి హైదరాబాద్‌కు హైకోర్టు పని మీద వచ్చిన శివప్రసాద్ హంషైర్ హోటల్‌లో దిగాడు. మరుసటి రోజు 16న వచ్చిన పని పూర్తవ్వగానే తిరిగి హోటల్‌కు చేరుకున్నాడు. 17 ఉదయాన హోటల్ సిబ్బంది శివప్రసాద్ గది తలుపు తట్టగా ఎంతకీ సమాధానం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపు తెరిచి చూడగా శివప్రసాద్ హత్యకు గురై రక్తపు మడుగులోపడి ఉన్నాడు.

దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు హోటల్‌లోని సిసి కెమెరా ఫుటేజీల ద్వారా అసలు నిందితుడ్ని గుర్తించారు. హంతకుడు ప్రశాంత్‌ను హైదరాబాద్ బోయిన్‌పల్లి చెక్ పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు.

శివప్రసాద్ ప్రశాంత్‌ను నానా బూతులు తిట్టేవాడని, రాత్రి సమయాల్లో బాడీ మాసాజ్ చేయాలని వేధింపులకు గురిచేసేవాడని, దీంతో కోపోద్రేక్తుడైన ప్రశాంత్ 16న రాత్రి శివప్రసాద్ నిద్రపోయిన తర్వాతగానే వెయింగ్ మిషన్‌తో అతడి తలపై బలంగా దాడి చేసి చంపాడని పోలీసులు చెప్పారు.

హత్య అనంతరం శివప్రసాద్ వద్ద నుంచి రెండు ఉంగరాలు, కొంత నగదు, ఎటిఎం కార్డులతోపాటు అతడి కారులోనే పారిపోయాడని తెలిపారు. మంగళవారం నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి ఉంగరాలతోపాటు కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+