రోడ్డు ప్రమాదం: నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

చేబ్రోలు మండలం నారాకోడూరు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న బస్సు ద్విచక్ర వాహన్నాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
నెల్లూరులో ఒకరు మృతి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు వద్ద ఉదయం జరిగిన రోడ్డు ప్రాదంలో ఒకరు మృతి చెందారు. నెల్లూరు నుండి ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురంలో వాహనం ఢీకొని పెద్దవడుగూరు మండలం మెడ్తూరు వద్ద ఒకరు మృతి చెందారు.
నల్లొండ కిష్టాపురంలో ఉద్రిక్తత
నల్గొండ జిల్లా కిష్టాపురంలో ఈ రోజు ఉదయం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. విద్యా కమిటీ చైర్మన్ ఎన్నిక వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. రెండు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో వాహనాలు ధ్వంసమయ్యాయి.
చిరుత మృతి
చిత్తూరు జిల్లా తిరుమల కనుమ రహదారిలో ఈ రోజు ఉదయం చిరుత మృతి చెందింది. నాలుగో కిలో మీటరు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.












Click it and Unblock the Notifications