మహిళా ఫొటో జర్నలిస్టుపై గ్యాంగ్ రేప్, అరెస్టులు

ఎంఎం జోషీ మార్గ్ పోలీసుల కథనం ప్రకారం - ఓ అసైన్‌మెంట్‌పై ఆమె మిల్ కాంపౌండుకు వెళ్లింది. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. జస్లోక్ అస్పత్రిలో ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఆమె ప్రాణాలకు ఏ విధమైన ప్రమాదం లేదని తెలుస్తోంది. మిల్ కాంపౌండు ప్రాంతం అత్యంత ప్రమాదకరమైందని, అసాంఘిక శక్తులు అక్కడ స్వైర విహారం చేస్తాయని అంటారు.
ఆమెతో పాటు వచ్చిన మగ సహోద్యోగిని దుండగులు కొట్టి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అమ్మాయికి గాయాలయ్యాయని, రక్తం కూడా కారుతోందని, అయితే చికిత్సకు ప్రతిస్పందిస్తోందని వైద్యులు చెబుతున్నారు.
మగ ఉద్యోగిని తీవ్రంగా కొట్టిన తర్వాత మహిళా ఫొటో జర్నలిస్టును ఓ మూలకు తీసుకెళ్లి రేప్ చేశారు. ఆ తర్వాత వారిద్దరిని వదిలేసి వెళ్లిపోయారు. ఇద్దరు అనంతరం తమ మిత్రులను, బాధితురాలి కుటుంబ సభ్యనలను పిలిచారు. సంఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications