వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా లేకుంటే ముందుకు: శివ, ప్రధానిపై నన్నపనేని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Siva Prasad
న్యూఢిల్లీ/హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారని చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఎంపి శివ ప్రసాద్ ఆదివారం ఆరోపించారు. వారి ఆందోళనల్లో నిజాయితీ లేదన్నారు. సోనియా లేనప్పుడు ముందుకు వచ్చి, ఉన్నప్పుడు వెనుకాలే ఉండి నిరసన తెలుపుతున్నారని విమర్శించారు.

సస్పెన్షన్ సమయంలో తమకు పేరు వస్తుందనే వారు తమతో కలిసి వచ్చారన్నారు. సీమాంధ్రలో ఉద్యమం శాంతించాలంటే సోనియా గాంధీ పెదవి విప్పాలన్నారు. ప్రభుత్వం వేసే అఖిల పక్ష కమిటీని తాము స్వాగతిస్తామని, కాంగ్రెసు కమిటీలపై తమకు విశ్వాసం లేదన్నారు. రేపటి నుండి ఎంపీలం పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగుతామని ఆయన చెప్పారు.

దేశానికి ప్రధాని ఉన్నారా?: నన్నపనేని

దేశానికి ప్రధానమంత్రి ఉన్నట్లా? లేనట్లా? అని టిడిపి ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఎద్దేవా చేశారు. సోనియా గాంధీ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్నారా అని ప్రశ్నించారు. సోనియా వేసే కమిటీలను తాము అంగీకరించమని, ప్రధాని అఖిల పక్ష కమిటీ వేయాలన్నారు.

రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు విభజనకు వ్యతిరేకంగా ఉన్నారని టిడిపి నేత కోడెల శివ ప్రసాద్ అన్నారు. అధికారం కోసమే కాంగ్రెసు విభజనకు తెరలేపిందన్నారు. విభజన రాజకీయ స్వార్థపరుల ప్రేరేపిత కుట్ర అని, ఎనిమిది గంటల్లోనే సిడబ్ల్యూసి, యూపిఏ నిర్ణయం ఏమిటని ప్రశ్నించారు. విభజనపై ప్రధాని మాట్లాడక పోవడం సరికాదన్నారు. కేంద్రమంత్రులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

టిపై పార్టీ వైఖరిలో మార్పు లేదు: వెంకయ్య

తెలంగాణపై బిజెపి వైఖరిలో మార్పు లేదని ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు వేరుగా అన్నారు. కాంగ్రెసు పార్టీ డబుల్ గేమ్‌ను ఆపాలన్నారు. దేశ ప్రజలకు కాంగ్రెసు పార్టీ నుండి విముక్తి కలిగించాల్సి ఉందన్నారు. పొత్తుల కోసం తాము పాకులాడటం లేదని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందన్నారు. పార్లమెంటులో తన ప్రసంగాన్ని వక్రీకరించారని, తెలంగాణపై తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు.

English summary
Chittoor TDP MP Siva Prasad on Sunday blamed Congress Party Seemandhra MPs over their agitation in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X