వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు ములాఖత్‌లు బంద్!ఢిల్లీకి పార్టీ నాయకులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSR Congress Party leaders
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చంచల్‌గూడ జైలు అధికారులు సోమవారం ములాఖత్‌లు నిలిపివేసినట్లుగా సమాచారం. సోమవారం ములాఖత్ సమయంలో జగన్‌ను కలిసేందుకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులను అధికారులు వారి అధినేతను కలిసేందుకు అనుమతివ్వలేదని సమాచారం.

కాగా, జగన్ దీక్ష సోమవారం రెండో రోజు కొనసాగుతోంది. ఆయనకు ఈ రోజు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం సాయంత్రం మళ్లీ జగన్‌కు పరీక్షలు చేస్తామని, ఆరు గంటలకు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు.

ఢిల్లీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఢిల్లీకి వెళ్లనున్నారు. వారు ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలను కలువనున్నారు.

రాష్ట్రాన్ని విభజిస్తే ఇరు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలని లేదంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని వారు ప్రధాని, రాష్ట్రపతిలను కోరనున్నారు. మంగళవారం మధ్యాహ్నం వారు ప్రధానిని కలిసే అవకాశాలున్నాయి.

English summary
YSR Congress Party leaders will go to New Delhi to meet Prime Minister Manmohan Singh and President Pranabh Mukherjee over AP division issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X