బాలికపై అత్యాచారం చేసి, ఆమె టైతోనే హత్య చేశాడు

 11 year old raped, killed with school tie, accused arrested
పుణే: ఐదవ తరగతి చదువుతున్న ఓ బాలిక ఒంటరిగా ఇంటికి వెళ్తుండగా గమనించిన ఓ యువకుడు ఆమెను బలవంతంగా పొలాల్లోకి తీసుకు వెళ్లి అత్యాచారానికి పాల్పడటమే కాకుండా టైతో గొంతుకు ఉరి బిగించి హత్య చేసిన సంఘటన పుణేలో చోటు చేసుకుంది.

బాలిక పాఠశాల నుండి ఇంటికి వెళ్తుండగా అతను ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె వేసుకున్న స్కూలు యూనిఫాం టైతో గొంతు బిగించి హత్య చేశాడు. పోలీసులు ఈ ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

తన కుమార్తెను రోజు తానే ఇంటికి తీసుకు వెళ్లేవాడినని, ఆ రోజు వీలుకాకపోవడంతో పాప నడిచి వచ్చే సమయంలో ఈ దారుణం జరిగిందని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తండ్రి డిమాండ్ చేశారు.

ప్రశాంతంగా ఉండే తమ గ్రామంలో ఇలాంటి సంఘటన కలచివేసిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుణేకు వంద కిలోమీటర్ల దూరంలో ఉండే గలంద్‌వాడి గ్రామంలో ఈ ఘటన జరిగింది.

నిందితుడిని 22 ఏళ్ల నితిన్ కదమ్‌గా గుర్తించారు. ఇతనిని శనివారం రాత్రి పక్క గ్రామం నిలక్వాడిలో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఇతనిని సెప్టెంబర్ 2 తేది వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులకు సహకరించిన ఆశ్రమ్ పాఠశాలకు మహారాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల రివార్డ్ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+