తిరుమలలో విరిగిన శ్రీవారి పాదం ఎడమ బొటన వేలు
చిత్తూరు: తిరుమల మెట్టు మీద ఉన్న శ్రీవారి పాదాల్లోని ఓ పాదం బొటన వేలు విరిగింది. ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. శ్రీవారి మెట్టు మీద ఉన్న శ్రీవారి పాదాల్లోని ఎడమ పాదం బొటన వేలు విరిగింది. దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం వెంటనే అతికించింది.
ఎడమ పాదం బొటన వేలు విరిగిందని గుర్తించిన భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొటన వేలు విరిగిపోవడంపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సంఘటన జరగడంపై భక్తులు ఆందోళన పడుతున్నారు.

శ్రీవారి పాదం బొటన వేలు విరగిన నేపథ్యంలో ఏదో ఒక ఉపద్రవం జరుగుతుందా అనే భయాందోళనలు కనిపిస్తున్నాయి. కాగా, శ్రీవారి పాదాలు తిరుమల ప్రధాన ఆలయానికి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
శ్రీవారి పాదాలున్న ఈ ప్రాంతాన్ని వెంకటేశ్వర స్వామి భూమి మీద తొలిసారి అడుగిడిన ప్రాంతంగా భక్తులు భావిస్తారు. వైకుంఠం నుండి నేరుగా శ్రీవారు ఇక్కడే అడుగుపెట్టారంటారు. కాగా, ఈ బొటన వేలు ఎలా విరిగిందనే విషయం తెలియరాలేదు.












Click it and Unblock the Notifications