'బాబును అడ్డుకుంటే ఊరుకోం: జగన్‌కు ఆదరణ లేదు'

బాబు యాత్రను అడ్డుకునే సత్తా ఎవరికీ లేదన్నారు. ఎవరైనా అడ్డుకున్నా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రజల్లో ఆదరణ పోయిందన్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకే జగన్ దీక్ష, షర్మిల బస్సుయాత్ర చేపడుతున్నారని మండిపడ్డారు.
నేతలతో బాబు భేటీ
ఆత్మగౌరవ యాత్ర కోసం చంద్రబాబు గుంటూరు జిల్లాకు చేరుకున్నారు. ఆయన విష్ణుపురం అతిథి గహంలో స్థానిక నేతలతో కాసేపు చర్చించారు.
బాబు యాత్రను అడ్డుకోం
చంద్రబాబు యాత్రను తాము అడ్డుకోబోమని ఎపి రెవెన్యూ సర్వీసెస్ అధ్యక్షుడు తెలిపారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని సమైక్యాంధ్రకు స్పష్టత ఇస్తే బాగుంటుందని వారు కోరారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామా చేయకుంటే జిల్లాల్లో అడుగు పెట్టనిచ్చేది లేదన్నారు.












Click it and Unblock the Notifications