కాంగ్రెస్ సమైక్యాంధ్ర పార్టీ!, 30 ని.ల్లో రిజైన్: రాయపాటి

Rayapati Sambasiva Rao
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ విభజన నిర్ణయం నేపథ్యంలో సమైక్యాంధ్ర నినాదంతో సీమాంధ్రలో త్వరలో కొత్త పార్టీ రానుందని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు ఆదివారం అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచే ప్రసక్తి లేదన్నారు. కాంగ్రెసు పార్టీ నేతల ఆధ్వర్యంలో కొత్త పార్టీ రావొచ్చన్నారు. ఆంధ్రులు ఆరంభశూరులని, సమైక్య పోరాటం త్వరలోనే నీరుగారుతుందని అంటున్న తెలంగాణ నేతలకు బుద్ధి చెప్పేలా కడవరకూ పోరాడుదామని ప్రజలకు పిలుపునిచ్చారు.

చెన్నైలోని ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఆస్కా) వజ్రోత్సవ ముగింపుసభకు కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ముఖ్యఅతిథిగా విచ్చేయగా, ప్రత్యేక అతిథిగా రాయపాటి మాట్లాడారు. తెలంగాణ ప్రకటన వెలువడిన అరగంటలోనే విదేశాల్లో ఉండీ, తాను రాజీనామా చేశానన్నారు. ఈ నెల 6న ఎంపీలంతా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారన్నారు. అయితే మంత్రుల్లో మాత్రం భిన్నస్వరాలు వినిపిస్తున్నాయన్నారు.

ఎపిలో నెలకొన్న పరిస్థితులకు అన్ని రాజకీయ పార్టీలు కారణమని, ఈ వ్యవహారంలో మరో వాదనకు తావులేదు అని తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజన ప్రకటనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీ తమిళనాడు శాఖ ఆధ్వర్యంలో చెన్నైలో ఆదివారం సమైక్య సింహగర్జన నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడారు.

రాష్ట్ర విభజన విషయంలో అన్ని పార్టీలు ముద్దాయిలే, ఈ పాపం అందరిదీ అన్నారు. తెలుగు వారి మనోభావాలను గౌరవించే విధంగా అన్ని పార్టీలు ఈ వ్యవహారంపై మరొక్కమారు పునఃసమీక్షించుకోవాలని అభ్యర్థించారు. రాష్ట్ర విభజన ప్రకటనలో తెలుగుదేశం పార్టీతో సహా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల వారి పాపం ఉందన్నారు.

రాష్ట్రంలో కేవలం 30 శాతం మంది మాత్ర మే తెలంగాణ వాదులున్నారని, మిగతా 70 శాతం మంది సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించిన వారేనన్నారు. కేంద్ర ప్రభుత్వం తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన తాటాకు చప్పుళ్లకు భయపడి విభజన ప్రకటన చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. విభజనంటూ జరిగితే రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+