బాబు, జగన్‌లకు బొత్స క్లాస్!: జైలు సెటైర్స్, గుంటనక్క

ఎన్నికల్లో గెలవడం కోసం వారు రాజకీయ డ్రామాలన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన విషయాన్ని ఆ పార్టీలు మర్చిపోయాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు తమ పార్టీ జాతీయ నాయకులను ముద్దపప్పు, ఇటలీ నాయకురాలు అనడం ఎంత వరకు సమంజసమన్నారు. బాబు ఢిల్లీకి వస్తామంటే ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు. తాను ఏం చేస్తానో చెప్పని చంద్రబాబు అధికారం ఇవ్వమనడం విడ్డూరమన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమన్యాయం అంటుందని కానీ, ఆ సమన్యాయం ఏమిటో మాత్రం చెప్పరన్నారు. కాంగ్రెసు పార్టీ చేస్తే మాత్రం తప్పనడం విడ్డూరమన్నారు. సమన్యాయం అంటే ఏమిటో జగన్ పార్టీ, చంద్రబాబు ఓ బహిరంగ లేఖ విడుదల చేయాలని సవాల్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, కేంద్రమంత్రి చిరంజీవిలను గబ్బిలాల్లా పదవులు పట్టుకొని వేలాడుతున్నారని చెప్పడం సరికాదన్నారు.
సమన్యాయం అంటే ఎలా పంచాలో జగన్ పార్టీ చెప్పాలన్నారు. చంచల్ గూడ జైలు ఒక ప్రాంతానికి, చర్లపల్లి జైలును మరో ప్రాంతానికి ఇవ్వమంటారా, బయ్యారం గనులు ఓ ప్రాంతానికి, ఓబుళాపురం గనులు మరో ప్రాంతానికి ఇవ్వమంటారా.. ఏమిటో చెప్పాలని ఎద్దేవా చేశారు. విభజనకు వ్యతిరేకం కాదని గతంలో చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పుడు సమైక్యవాదం అందుకుందన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు సమయం ఆసన్నమైందని 2009లోనే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారన్నారు. ఈ విషయాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గుర్తించాలన్నారు. విభజనపై ఆ రెండు పార్టీల విధానమేమిటో స్పష్టంగా చెప్పాలన్నారు. ప్రజలను విపక్షాలు మభ్యపెడుతున్నాయన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చడం సరికాదన్నారు. దయచేసి అందరు సంయమనం పాటించాలని కోరారు. నీళ్లు, ప్రాజెక్టుల వంటి సమస్యలు ఏమైనా ఉంటే కూర్చొని పరిష్కరించుకుందామని చెప్పారు.
జంతువులపై...
విపక్ష నేతలు తమ పార్టీ నాయకులను గబ్బిలాలు, జంతువులతో పోల్చడం సరికాదని బొత్స అన్నారు. పెంపుడు కుక్కలు విశ్వాసానికి ప్రతీకలని, గుంట నక్కలు మాత్రం అలా ఉండవని విపక్ష నేతలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మనుషులు కాని వారే ఇతరులను జంతువులతో పోలుస్తారన్నారు.












Click it and Unblock the Notifications