వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దూషణ: సందీప్ డౌన్‌డౌన్ అంటూ సభలో నినాదాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Parliament
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ చిత్తూరు ఎంపి శివ ప్రసాదును అసభ్య పదజాలంతో దూషించిన సందీప్ దీక్షిత్ డౌన్ డౌన్ అంటూ విపక్ష సభ్యులు మంగళవారం లోకసభలో నినాదాలు చేశారు. సోమవారం సందీప్ టిడిపి సభ్యులు, శివ ప్రసాదును దూషించిన విషయం తెలిసిందే. దీనిపై ఈ రోజు విపక్ష సభ్యులు సందీప్ దీక్షిత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాగా, సందీప్ పైన టిడిపి ఎంపి నామా నాగేశ్వర రావు ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందిందని స్పీకర్ సభలో వెల్లడించారు. అలాగే సీమాంధ్ర టిడిపి ఎంపీలపై కాంగ్రెసు ఎంపీలు పొన్నం ప్రభాకర్, తదితరులు ఇచ్చిన నోటీసు అందినట్లు తెలిపారు.

మరోవైపు, సమావేశాలు ముగుస్తున్న బొగ్గు కుంభకోణంపై చర్చ చేపట్టలేదని బిజెపి ఆందోళన చేపట్టింది. బొగ్గు దస్త్రాల గల్లందుపై ప్రధాని మన్మోహన్ సింగ్ సమాధానం చెప్పాలని సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. సభలో సజావుగా జరగకపోవడంతో స్పీకర్ పన్నెండు గంటలకు వాయిదా వేశారు.

సోమవారం సీమాంధ్ర తెలుగుదేశం, కాంగ్రెసు ఎంపీలు సస్పెండైన విషయం తెలిసిందే. మంగళవారం సమావేశాలు ప్రారంభం కాగానే తమ ప్రాంత ప్రయోజనాలు కాపాడాలంటూ టిడిపి సీమాంధ్ర ఎంపీలు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో చైర్మన్ సుజనా చౌదరి, సిఎం రమేష్‌లను సస్పెండ్ చేశారు. పలువురు ఎంపీలు పార్లమెంటు ద్వారం వద్ద బైఠాయించారు.

English summary

 Opposition make slogans agaist MP and Congress Whip Sandeep Dikshit on Tuesay in Lok Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X