గొలుసు దొంగలకు దేహశుద్ది, అరగుండు

నెల్లూరు జిల్లాలో పెదపడుగులో గొలుసు దొంగతనానికి యత్నించిన ఇద్దర్ని స్థానికులు పట్టుకున్నారు. స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం వారికి అరగుండు గీసి పోలీసులకు అప్పగించారు. గొలుసు దొంగలను పట్టుకోవడానికి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వారి నిర్లక్ష్యం వల్లే గొలుసు దొంగలు పెరిగిపోతున్నారన్నారు.
వ్యక్తి దారుణ హత్య
సికింద్రాబాద్: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్య గురయ్యాడు. బుధవారం స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుడు మౌలాలికి చెందిన శ్రీకాంత్ గా పోలీసులు గుర్తించారు. కత్తితో గొంతుకోసి హత్య చేసినట్లు ఆనవాల ద్వారా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అల్వాల వాగులో మూడు మృతదేహాలు
కర్నూలు: జిల్లాలోని గొనెగొండ్ల మండలం అల్వాల వాగులో నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వారికోసం గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో మృతదేహం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications