మరో స్త్రీతో అక్రమ సంబంధం: భార్యాకొడుకుల హత్య

Illicit affair: Man kills wife and son
హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని ఓ వ్యక్తి విషమిచ్చి భార్యను, కుమారుడిని హత్య చేశాడు. శవాలను ఇంట్లో పెట్టి తాళం వేశాడు. ఈ సంఘటన హైదరాబాదులోని జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రియురాలితో కలిసి హుస్సేన్‌సాగర్‌లో బోటు షికారుకు వెళ్లి నీళ్లల్లో దూకడంతో బోటు నడిపే వారు రక్షించి లేక్ వ్యూ పోలీసులకు అప్పగించారు. దీంతో జంటహత్యల విషయం బయటపడింది.

తన భార్యను, కుమారుడ్ని దొంగలు హత్య చేసి సొత్తు దోచుకుపోయారని నమ్మించడానికి అతను ప్రయత్నించాడు. జీడిమెట్ల మిగతా పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. వివరాలు ఇలా ఉన్నాయి - పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం అరటికట్ల గ్రామానికి చెందిన కూచంపూడి రమేష్‌వర్మ (40)కు పార్వతి (35)తో1998లో వివాహం జరిగింది. వారి కుమారుడు వాసుదేవ్ (10).

ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన రమేష్‌వర్మ మూడేళ్లుగా గాజులరామారంలోని వీఎస్ఆర్ అపార్ట్‌మెంట్‌లోని బి-బ్లాక్ 407 ప్లాట్‌లో నివాసముంటున్నాడు. ఇంట్లోనే ఉంటూ షేర్స్ వ్యాపారం చేసే రమేష్‌వర్మకు ఇదే అపార్ట్‌మెంట్‌లో ఉంటూ భర్తతో విడాకులు తీసుకున్న రమావతితో వివాహేతర సంబంధం ఏర్పడింది.

వివాహేతర సంబంధం గురించి పది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి పథకం ప్రకారం రమేష్‌వర్మ భార్య పార్వతి, కుమారుడు వాసుదేవ్‌కు నిద్రమాత్రలు ఇచ్చాడు. వారు మత్తులోకి జారుకున్న తర్వాత నీళ్లల్లో ముంచి హత్య చేశాడు. మృతదేహాలను బెడ్‌రూంలో నేలపై పడుకోబెట్టాడు.

తాను చేసిన నేరం బయటపడుతుందని భయపడ్డ రమేష్‌వర్మ ఆత్మహత్య చేసుకోవాలని నీళ్లలో ప్రియురాలితో బోటు షికారు చేస్తూ హుస్సేన్‌సాగర్‌లో దూకాడు. బోటు నడిపే వారు అతడ్ని రక్షించి పోలీసులకు అప్పగించారు. జీడిమెట్ల పోలీసులు రమేష్‌వర్మ, రమావతిని అదుపులోకి తీసుకుని విచారించారు. తానే హత్యలు చేసినట్టుగా రమేష్‌వర్మ అంగీకరించాడని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+