గుంటూరు ఘాటుకి సోనియా పరార్! తెగబడతా: బాబు

రాష్ట్ర ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టారని, వారి మనసులను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారని, ఓట్లు, సీట్ల కోసం కుట్రలు, కుతంత్రాలు పన్నారని, సీమాంధ్రను అతలాకుతలం చేశారని, ఎపికి ఇప్పటికైనా న్యాయం చేయకపోతే కాంగ్రెసు పై తెగబడి పోరాడుతామన్నారు. ప్రజల కోసం తాను తెగబడి.. తిరుగబడతానన్నారు. తెలంగాణకు న్యాయమంటే సీమాంధ్రకు అన్యాయమని కాదన్నారు.
చిచ్చుపెట్టిన వారు మనుగడ సాధించడానికి వీల్లేదన్నారు. కాంగ్రెసు పార్టీకి కనువిప్పు కలగడం లేదని, తమ పార్టీ జోలికొస్తే మసైపోతారన్నారు. ఇరు పక్షాల ప్రజలతో మాట్లాడాలని, ఇద్దరికీ న్యాయం జరగాలని, అలా కాకుండా సీమాంధ్రకు అన్యాయం జరిగితే తిరగబడతానని చెప్పారు. సీమాంధ్రుల ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని, టిడిపి సమైక్యానికి ఒకప్పుడు కట్టుబడి ఉన్న మాట వాస్తవమేనని, ఆ తర్వాత తెలంగాణ ప్రజల ఉద్యమం, మనోభావాలను దృష్టిలో ఉంచుకుని వారి సమస్యలను పరిష్కరించాలని లేఖ ఇచ్చిన మాట వాస్తవమే అన్నారు.
అయినా మీకు ఎక్కడా అన్యాయం చేయమనలేదన్నారు. సీమాంధ్రలో ఉండే తెలుగువారికి ఇబ్బందులు ఉన్నాయని, 37 రోజులుగా ప్రజలు రోడ్లపై ఉన్నారని, ఇప్పటికీ కాంగ్రెస్‌కు కనువిప్పు కలగలేదని, మొద్దు నిద్రలో ఉందని, ఇప్పటికైనా కాంగ్రెసు నిర్ణయం మార్చుకోవాలని, లేదంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. సోనియాకు సీట్లు కావాలంటే తెలుగువాళ్లు కొట్లాడుకోవాలా? అంటూ ప్రశ్నించారు.
ప్రజల ఆవేద, ఆగ్రహాన్ని అర్థం చేసుకోకుండా పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్న కాంగ్రెసు సంగతిని తేల్చేయడానికి టిడిపి నడుం కట్టిందని, కురుక్షేత్రం జరుగుతోందని, కౌరవ సంతతైన కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ఓటమి తప్పదన్నారు. అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించి అందులో రాజకీయ లబ్ధి పొందాలని వైయస్సార్ కాంగ్రెసు చూస్తోందని దుయ్యబట్టారు.
బైబిల్ వంటి పవిత్రమైన బైబిల్‌ను ప్రజలకు న్యాయం జరగాలని, ప్రపంచానికి మంచి జరగాలనుకునే వారు పట్టుకుంటారని, చెడును ప్రోత్సహించే మనసుతో, అబద్ధాలతో పత్రికలు పెట్టిన వారు బైబిల్‌ను పట్టుకోవడం ఏమిటి? ఓడిపోతామన్న ఉద్దేశంతో 1999లో తెలంగాణాకు అనుకూలంగా ఎమ్మెల్యేలను దివంగత వైయస్ ఢిల్లీకి పంపారని, 2004లో తెరాసతో పొత్తు పెట్టుకున్నారని, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెస్‌తో లాలూచీ పడకపోతే జైల్‌లో ఉన్న జగన్ చేపట్టిన దీక్ష నేరమైనా హెల్త్ బులెటిన్‌లు ఎందుకు ప్రకటిస్తారు? అంతా జగన్నాటమన్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications