16తర్వాత చెప్తాం, కోర్టు ఏం చెప్పినా తగ్గం: అశోక్‌బాబు
హైదరాబాద్: తమ భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ఈ నెల 16వ తేది తర్వాత చెప్తామని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు బుధవారం చెప్పారు. తమ పిటిషన్ పైన ఈ నెల 16న హైకోర్టు తీర్పు వచ్చే అవకాశముందన్నారు. హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా తమ సమ్మె కొనసాగుతుందన్నారు. భవిష్యత్తు కార్యాచరణ ఆ తర్వాతే చెప్తామన్నారు.
ఉద్యోగులు సమ్మె చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పారు. ఈ నెల 13వ కేంద్ర కార్యాలయాలను దిగ్భందిస్తామని చెప్పారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కూడా తమకు శాంతియుతంగా నిరసనలు చేపట్టే హక్కు లేదా అని ప్రశ్నించారు. తాము శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే తెలంగాణవాదులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులను రాజీనామాల కోసం తాము నిలదీస్తామన్నారు. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్నదే తమ ప్రధానమైన డిమాండ్ అన్నారు. విభజన నిర్ణయంపై పునరాలోచించే వరకు సమ్మెపై వెనక్కి తగ్గేది లేదన్నారు. తెలంగాణపై నోట్ రెడీ అవుతుందన్న వార్తలతో రాజకీయ వాతావరణంలోను మార్పు కనిపించిందన్నారు.
రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎండి ఎకె ఖాన్‌లు తమతో చర్చలు జరిపారని, సమ్మెను విరమించాలని కోరారని ఆర్టీసి జెఏసి నేత చెప్పారు. సమ్మె నుంచి ఆర్టీసని మినహాయించాలని కోరారన్నారు. తాము కుదరదని చెప్పామన్నారు. ఆర్టీసిని ప్రభుత్వం పరిధిలోకి తీసుకు రావాలని చెప్పామన్నారు. సమైక్య ఉద్యమం నుండి తాము వెనక్కి వెళ్లమన్నారు.
రాజీనామా అక్కర్లేదు: జెడి శీలం
సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు అక్కర్లేదని కేంద్రమంత్రి జెడి శీలం వేరుగా అన్నారు. ఓపికతో వ్యవహరించాలన్నారు.












Click it and Unblock the Notifications