విచక్షణ కోల్పోయిన ప్రభుత్వ టీచర్ ,స్వంత ఇంటికి నిప్పు
ఆయన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, పిల్లలు ,భార్యభర్తల మధ్య గోడవలతో తన విచక్షణను కోల్పోయాడు. దీంతో ఇంట్లో ఉన్న బట్టలకు నిప్పంటించాడు. ఇంట్లోనే భార్య, పిల్లలను వదిలి బయటకు వెళ్లిపోయాడు .దీంతో మంటలు వ్యాపించి ఇళ్లు కాలిబుడిదయింది. అదృష్టవశాత్తు భార్యపిల్లలు బతికి బయటపడ్డారు.
కోమురం భీం జిల్లా జైనూరు మండలం జంగాం గ్రామానికి చెందిన కుమ్ర నారయణ ,యమునాభాయ్ దంపతులకు ముగ్గురు సంతానం అయితే నారయణ ప్రభుత్వ టీచర్ గా చేస్తున్నాడు, అయితే పిల్లలకు సంబంధించి ఇంట్లో ఘర్షన నెలకోంది. వాళ్ల ప్రయోజనం గురించి భార్యభర్తల మధ్య మాటమాట పెరగడంతో మధ్య గొడవ జరిగింది.

ఈ నేపథ్యంలోనే కోపోద్రిక్తుడైన నారయణ ఇంట్లో పిల్లలు ఉన్నారనే విచక్షణ కూడ లేకుండా బట్టలపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు,అనంతరం అక్కడ నుండి పారిపోయాడు.అయితే ఈ మంటలకు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ సైతం పేలింది. దీంతో వారంతా పరుగులు తీశారు. వెంటనే తేరుకున్న గ్రామస్థులు ఇంటికి విద్యుత్ సరఫరా ను నిలిపి వేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications