లాక్ డౌన్ ఎంత పనిచేసింది.. విషాదంగా మిగిలిపోయిన ప్రేమ జంట..

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. తమ పెళ్లికి లాక్ డౌన్ అడ్డు వచ్చిందన్న కారణంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే.. నార్నూర్ మండలం కన్నాపూర్‌కు చెందిన గణేష్, కంపూర్‌కు చెందిన సీతా భాయి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో వాళ్లకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే మొదట ఇరువురి పెద్దలు అందుకు ససేమిరా అన్నారు. అయినప్పటికీ ఇద్దరు తీవ్రంగా ప్రయత్నించి ఎలాగోలా ఇరు కుటుంబాలను ఒప్పించారు. ఈ క్రమంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.

love couple committed suicide in adilabad district

ఇక వివాహానికి ముహూర్తాలు పెట్టుకోవాలని చూస్తున్న తరుణంలో కరోనా వారి ప్రయత్నాలకు బ్రేక్ వేసింది. అనుకోని లాక్‌డౌన్ కారణంగా పెళ్లి నిలిచిపోయింది. అయినప్పటికీ.. తక్కువ మందితో నిరాడంబరంగా పెళ్లి జరిపిద్దామని ఆ జంట ఇరువురు పెద్దలను కోరింది. అయితే లాక్‌డౌన్ ముగిసే వరకు ఆగాల్సిందేనని వారు తేల్చి చెప్పారు. లాక్‌డౌన్‌ను అడ్డంపెట్టుకొని పెళ్లిని వాయిదా వేస్తున్నారని.. ఆ జంట మనస్థాపానికి గురైంది.

ఈ క్రమంలో ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్యహత్య చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. పెళ్లి చేసుకుని బతకాల్సిన జంట ఇలా ప్రాణం తీసుకోవడం వారిని తీవ్రంగా కలచివేసింది. స్థానికులు సైతం విగతజీవులుగా పడివున్న ఆ జంటను చూసి కంటతడి పెట్టుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+