ఆ పార్టీనే బంగాళాఖాతంలో కలపండి: నిర్మల్‌లో కేసీఆర్, పార్టీ, కలెక్టరేట్ ఆఫీస్ ప్రారంభం

ఆదిలాబాద్: తెలంగాణ మోడల్ దేశమంతా మార్మోగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇందుకు ప్రభుత్వ ఉద్యోగులే కారణమని వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రమైన నిర్మల్‌లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, రూ. 56.2 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఎల్లపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాపై సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు.

నిర్మల్ జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా రూ. 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున, జిల్లాలోని 19 మండలాలకు ప్రతి మండల కేంద్రానికి రూ. 20 లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు. బాసర ఆలయాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోబోతున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు.

 Nirmal Collectorate and brs party office launched by CM: KCR slams congress for dharani issue.

గతంలో ఆదిలాబాద్ జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉంటే.. ఇప్పుడు నాలుగు జిల్లాలు అయిన తర్వాత మరో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు కేసీఆర్. పేదల కోసం నిర్మించిన 2వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. అవినీతికి అడ్డుకట్ట వేసిన ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని మండిపడ్డారు.

ధరణిని బంగాళాఖాతంలో వేయాలన్న వారిని బంగాళాఖాతంలో వేయాలన్నారు కేసీఆర్. మళ్లీ అవినీతికి తెరలేపడానికి కాంగ్రెస్ నాయకులు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్ ఉండటం వల్లే 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతోందన్నారు. ధరణిని తొలగిస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయా? అని ప్రశ్నించారు.

ఎస్ఆర్ఎస్పీ కింద 2 స్కీంలు త్వరలో పూర్తి చేస్తామని.. దీంతో లక్ష ఎకరాలకు నీళ్లందుతాయన్నారు. గత 9 ఏళ్లలో తెలంగాణలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలయ్యాయని చెప్పారు. మహారాష్ట్ర ప్రజలు కూడా తెలంగాణ పథకాలు కావాలంటున్నారని తెలిపారు. దేశంలో తెలంగాణ రోల్ మోడల్‌గా నిలుస్తోందన్నారు. అందుకే, ప్రజలంతా తమకు అండగా ఉండాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+