కాల్పుల మోత: తుపాకీతో రెచ్చిపోయిన ఎంఐఎం నేత, ఒకరి పరిస్థితి విషమం..
ఎంఐఎం నేత రెచ్చిపోయాడు. ఏకంగా తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా తాటిగూడలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పారూఖ్ రివాల్వర్‌తో బెంబేలెత్తించాడు. కాల్పుల్లో ముగ్గురు తీవ్రంగా పడ్డారు. క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Recommended Video

యువకులపై తుపాకీతో ఫరూక్ కాల్పులు జరిపారు. అనంతరం కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. మోసిన్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. మోసిన్‌ను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. దీంతో బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ఫరూక్ అహ్మద్‌ను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. పాతకక్షలతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఫరూక్ ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు.. ప్రత్యర్థి వర్గానికి చెందిన ఇద్దరిపై కాల్పులు జరిపారు. కాల్పులు జరపడంతో జమీర్, మోతేషాన్ గాయపడ్డారు. కత్తి దాడిలో గాయపడ్డ మన్నన్‌కు గాయపడ్డారు. వీరిని రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది. కాల్పులు జరిపిన ఫరూక్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అతనిని అరెస్ట్ చేయాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాల్పుల ఘటన మాత్రం కలకలం రేపుతోంది. ఎంఐఎం నేత రెచ్చిపోయారని చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications