అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

13 వేల స్కూళ్ల విలీనం..? స్కూల్ స్కూల్‌కు పెరిగిన దూరం, ఏపీ సర్కార్ నిర్ణయం..?

|
Google Oneindia TeluguNews

ప్రాథమిక పాఠశాలల విలీనంపై ఏపీ సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే 6 వేల పాఠశాలల విలీనం అనే ఊహాగానాలు వచ్చినా.. అదీ 13 వేలకు చేరినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో పిల్లలు ప్రాథమిక పాఠశాలకు వెళ్లాలంటే కిలోమీటర్లు నడవాల్సి రానుంది. ప్రాథమిక పాఠశాలల విలీన ప్రక్రియలో వేగం పెంచాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అధికారుల సమావేశాల్లో చెప్పినట్లు సమాచారం.

250 మీటర్ల దూరం.. కానీ

250 మీటర్ల దూరం.. కానీ

ఉన్నత పాఠశాలలకు 250 మీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలను మాత్రం విలీనం చేయాలని, వచ్చే ఏడాది ఒక కిలోమీటరు లోపు చేయాలని అక్టోబరులో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలల నుంచి మూడు, నాలుగు, ఐదో తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో కలిపేశారు. ఆ దూరం పరిధిలో ఉన్నవి విలీనం చేయడంతో సుమారు ఆరు వేల ప్రాథమిక పాఠశాలల్లో 3,4,5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో కలిసిపోయాయి. ఇప్పుడు ఈ విలీనాన్ని కిలోమీటరు పరిధిలో ఉన్నవాటికీ వర్తింపజేయాలని భావిస్తున్నారు.

కిలోమీటర్‌కు పెంపు..

కిలోమీటర్‌కు పెంపు..

ఈ ఏడాదినుంచే కిలోమీటరు దూరంలోని స్కూల్స్ చేయాలని భావిస్తున్నారు. దీంతో 13 వేల పాఠశాలల్లోని 3,4,5 తరగతులు విలీనం అవుతాయి. వచ్చే ఏడాది ఈ దూరాన్ని మరింత పెంచి రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను విలీనం చేసేసేందుకు అంతర్గత కార్యాచరణ సిద్ధం చేసేశారని తెలుస్తోంది. దీంతో చిన్నపిల్లాడు పాఠశాలకు వెళ్లాలంటే కనీసం ఒక కిలోమీటరు నుంచి రెండు, మూడు కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. ఒక ఊరి నుంచి మరో గ్రామానికి వెళ్లాల్సిన పరిస్థితులూ ఏర్పడే అవకాశం ఉంటుంది.

నో ఇంట్రెస్ట్..

నో ఇంట్రెస్ట్..

దూరం పెరిగేకొద్దీ బడిమీద ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. దూరం పెరిగేకొద్దీ తల్లిదండ్రులకు భారంగా మారుతుంది. పాఠశాలలు దగ్గరిలో ఉంటే గబుక్కున వారిని అక్కడికి పంపేసి...పనులకు వెళ్లిపోయే పేదలు ఇప్పుడిక ఇబ్బందే. పాఠశాలలు దూరం కావడంతో తమ పిల్లలను ఉదయం దించాలి. సాయంత్రం మళ్లీ తీసుకువచ్చేందుకు వెళ్లాలి. ఇదంతా పనులకు వెళ్లే తల్లిదండ్రులకు సమస్యగా మారి.. విద్యాభ్యాసం నుంచే దూరం చేసే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో మొత్తం 34 వేల ప్రాథమిక పాఠశాలలు ఉండగా...వాటిలో అత్యధిక శాతాన్ని దశలవారీగా ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేయనున్నారని సమాచారం.

సమస్యలు

సమస్యలు

తొలి దశ విలీనంలోనే అనేక సమస్యలు వచ్చాయి. విద్యావ్యవస్థ మొత్తం గందరగోళంలో పడిందా అనే పరిస్థితి ఏర్పడింది. ఉన్నత పాఠశాలకు 250 మీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులు తరలివచ్చేశాయి. ఆయా తరగతుల్లో ఉన్న విద్యార్థులు వచ్చారు. కానీ ఆయా తరగతులకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు మాత్రం రాలేదు. వచ్చేందుకు ఉపాధ్యాయులే లేరు. ఇక్కడ ఉన్నత పాఠశాలల్లో కొత్తగా వచ్చిన తరగతులకు పాఠాలు చెప్పేందుకు టీచర్లు లేరు. అప్పటివరకు ఉన్న తరగతులు, విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకే అరకొరగా ఉండడంతో...ఇక కొత్త తరగతులు, కొత్తగా విలీనమైన విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు లేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో వందలు, వేల పాఠశాలల్లో ఈ సమస్య ఏర్పడింది.

Recommended Video

#Visakhapatnam : 13 Mandals In Vizag District To Be Merged With VMRDA
టీచర్ల కొరత

టీచర్ల కొరత


ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలన్నది ఎప్పటినుంచో డిమాండ్‌ ఉంది. ఆ డిమాండ్‌ సంగతి దేవుడెరుగు...విలీన ప్రక్రియను ముందుకుతీసుకెళ్తే ఏకంగా ఒక పాఠశాల మొత్తానికి ఒకే ఉపాధ్యాయుడు ఉండే పరిస్థితి రావచ్చు. అతనే టీచరు, అతనే హెడ్‌మాస్టరు, అతనే మధ్యాహ్న భోజనం పర్యవేక్షకుడు, అతనే పాఠశాల విద్యా శాఖ పెట్టిన పలు యాప్‌లకు ఫొటోలు పంపాల్సిన వ్యక్తి. అంటే ఒక ఉపాధ్యాయుడు అన్నీ పనులు చేయాల్సిందే.

English summary
13 thousand primary schools to merged in andhra pradesh. one school to another school distance is one kilo meter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X