ఏపీలో భారీస్థాయిలో తగ్గిన కరోనా కేసులు.. 8 మంది మృతి
ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మొన్న 3 వేల కేసులు రాగా.. నిన్న 2 వేల కేసుల వరకు వచ్చాయి. ఇవాళ మరింత తగ్గాయి. గత 24 గంటల్లో 1,597 కరోనా కేసులు వచ్చాయి. కరోనా సోకిన 8 మంది చనిపోయారు. విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. 8 వేల 766 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 62వేల 395 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 18 వేల 601 కోవిడ్ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో 3,26,79,288 కరోనా టెస్టులు చేశారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14,672కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,05,052కి చేరింది. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 22,27,985గా ఉంది. గత 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 478 కరోనా కేసులు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 15 కేసులు వెలుగుచూశాయి.
దేశంలో ఒమిక్రాన్ సాముహిక వ్యాప్తి దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఇంతలోనే డ్రాగన్ మరో స్టేట్ మెంట్ ఇచ్చింది. కొత్త వైరస్ వేరియంట్ గురించి చెప్పి.. ఆందోళన కలుగజేసింది. యూరప్‌లో కూడా ఈ ఏడాది చివరి వరకు కరోనా వైరస్ అంతం అవుతుందని ప్రకటన చేసింది.

ఇటు వ్యాక్సిన్ తీసుకున్న వారి జోలికి ఒమిక్రాన్ రాబోదని.. అందుకే నిపుణులు కచ్చితంగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. వైరస్ తగ్గుముఖం పడుతున్న.. జాగ్రత్తతో ఉండాలని కోరింది. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మాత్రం వేగంగా వ్యాప్తి చెందింది. అందరినీ ఒకసారి పలకరించింది మరీ వెళ్తుంది. అలా రాజకీయ నేతలు కూడా వైరస్ బారిన పడతున్నారు. వారంత వృద్దులే కావడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. రికవరీ రేటు కూడా ఎక్కువే ఉండటం ఊరట కలిగించే అంశంగా మారింది. ఇప్పుడు క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.












Click it and Unblock the Notifications